వ్యవసాయేతర ఆస్తుల నమోదు కోసం స్లాట్ బుకింగ్‌లకు మొదటి రెండు రోజుల్లో మంచి స్పందన లభించింది. ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజే 48 స్లాట్లు నమోదయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 10,509 స్టాట్లు నమోదయ్యాయి.
మరో 620 స్లాట్లు నమోదు కావడానికి సిద్ధంగా ఉన్నాయి. దీని ద్వారా సర్కారు ఖజానాకు 32 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఏడు ప్రధాన రకాల లావాదేవీలకు స్లాట్ నమోదు సేవలు అందుబాటులో ఉన్నాయి. వచ్చే 16 రోజుల్లో అదనంగా 16 రకాల లావాదేవీలకు సంబంధించిన సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ నెల 14 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి : 'మెజార్టీ అభిప్రాయం కాదు... ఏకాభిప్రాయం సాధించాలి'