హైదరాబాద్ స్లేట్ ద స్కూల్ అబిడ్స్ 19వ వార్షికోత్సవం నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లలిత కళాతోరణంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అద్యంతం అలరించాయి. సంప్రదాయ, ప్రాశ్చత్య, ఆధునిక నృత్యాలతో చిన్నారులు అదరహో అనిపించారు. పిల్లల పెంపకం, వ్యక్తిత్వం, వారి భవిష్యత్తుని తీర్చిదిద్దే విధానం ప్రధాన ఇతివృతంగా ఈ వార్షికోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ పిల్లలు చేసిన నృత్యాలను వీక్షిస్తూ పెద్దలంతా చిన్నారులై కేరింతలు కొట్టారు.
ఇదీ చూడండి: 'ముప్పవరపు' వారి సంక్రాంతి సంబురాలు