sirpurkar commission: ఎన్‌హెచ్‌ఆర్సీ బృందంపై సిర్పూర్కర్ కమిషన్ అసహనం - telangana news
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులపై సిర్పూర్కర్ కమిషన్ (sirpurkar commission) అసహనం వ్యక్తం చేసింది. ఎన్కౌంటర్లో పోలీసులు ఎక్కడి నుంచి కాల్పులు జరిపారనే విషయాలు ఘటనా స్థలంలో సేకరించకుండా పోలీసులు చెప్పిన విషయాలు ఎందుకు నమోదు చేసుకున్నారని ప్రశ్నించింది.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ తీరుపై సిర్పూర్కర్ కమిషన్ (sirpurkar commission) అసహనం వ్యక్తం చేసింది. ఎన్‌కౌంటర్ జరిగిన చోట మృతదేహాలు పడి ఉన్న తీరును ప్రత్యక్షంగా వెళ్లి ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. ఎన్కౌంటర్లో పోలీసులు ఎక్కడి నుంచి కాల్పులు జరిపారనే విషయాలు ఘటనా స్థలంలో సేకరించకుండా పోలీసులు చెప్పిన విషయాలు ఎందుకు నమోదు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రజలు భారీ ఎత్తున గుమిగూడటంతోనే వెళ్లలేకపోయం..
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఏర్పాటైన సిర్పూర్కర్ కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుల బృందాన్ని విచారించింది. ఎన్‌కౌంటర్ జరిగిన రోజు... ఘటనా స్థలంలో ప్రజలు భారీ ఎత్తున గుమిగూడటంతో... అక్కడికి వెళ్లలేకపోయామని బృంద సభ్యులు తెలిపారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకొని మృతదేహాల పంచనామా నిర్వహించగా... మీరు ఎందుకు వెళ్లలేకపోయారని బృంద సభ్యులను సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నించింది.
సజ్జనార్‌ను మరో రోజు విచారణకు పిలిచే అవకాశం...
‘దిశ’ హత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్న సజ్జనార్‌ను బుధవారం రోజు విచారణకు హాజరు కావాలని సిర్పూర్కర్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ... ముందుగా మృతదేహాలను తీసుకెళ్లిన డ్రైవర్లతో పాటు, డాక్టర్లను కమిషన్ విచారించే అవకాశం ఉంది. దీంతో సజ్జనార్‌ను మరో రోజు విచారణకు పిలిచే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: పోసాని కృష్ణమురళిపై దాడికి పవన్ అభిమానుల యత్నం