ETV Bharat / state

Singareni CMD: ప్రాజెక్టుల ప్రగతిపై ప్రతి నెలా సమీక్ష

సింగరేణి సంస్థలో రానున్న మూడేళ్ల కాలంలో 10 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించనున్నామని సింగరేణి సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు, అనుమతులు వంటి వాటికి సంబంధించిన అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల ప్రగతిపై ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తామని సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ స్పష్టం చేశారు. కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే..2023-24 నాటికి 850 లక్షల టన్నుల బొగ్గు ఉత్తత్తికి సింగరేణి చేరుతుందని సీఎండీ ఆశాభావం వ్యక్తంచేశారు.

author img

By

Published : Sep 6, 2021, 10:40 PM IST

Singareni CMD
Singareni CMD

రానున్న మూడేళ్లలో ప్రారంభించనున్న కొత్త ప్రాజెక్టులపై సింగరేణి సీఎండీ శ్రీధర్​... ప్రాజెక్టుల వారీగా సమీక్షించారు. ఈ ఏడాది ఉత్పత్తి ప్రారంభించనున్న జీడీకే-5 ఓపెన్‌ కాస్టు, జేవీఆర్‌ ఓసీ-2 ఎక్స్‌టెన్షన్‌, నైనీ ప్రాజెక్టు కలిపి 10 మిలియన్‌ టన్నులు సాధించాల్సిన ఉత్పత్తి లక్ష్యాలను సమీక్షించారు. ఇవాళ హైదరాబాద్‌ సింగరేణి భవన్​లో ఆపరేషన్స్ సంస్థ డైరెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌, ప్రాజెక్టు అండ్ ప్లానింగ్ ఫైనాన్స్, పర్సనల్ డైరెక్టర్‌ ఎన్‌.బలరామ్‌, ఈఅండ్​ఎం డైరెక్టర్‌ డి.సత్యనారాయణరావుతో పాటు, సలహాదారులు, కోల్ మూమెంట్ ఈడీ, ప్రాజెక్టు ప్లానింగ్‌, ఎస్టేట్స్‌, మార్కెటింగ్‌ తదితర శాఖల జీఎంలు, జనరల్‌ మేనేజర్‌, కో-ఆర్డినేషన్‌ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

2021-22 లో ప్రారంభించనున్న జీడీకే కోల్‌ మైన్‌ నుంచి ఏడాదికి 30 లక్షల టన్నులు బొగ్గు, ఒడిశా రాష్ట్రం నుంచి నైనీ బ్లాక్ బొగ్గు 100 లక్షల టన్నులు, తదుపరి సంవత్సరాల్లో వీకే కోల్‌ మైన్‌ నుంచి 53 లక్షల టన్నులు, జీడీకే 10-ఆర్‌జీ కోల్‌ మైన్‌ నుంచి 60 లక్షల టన్నులను వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలుగా ప్రతిపాదించినట్లు సీఎండీ శ్రీధర్ తెలిపారు. ఈ గనులకు సంబంధించిన మిగిలిన అనుమతులను వేగవంతం చేయాలని... అన్ని అనుమతులు వచ్చిన తర్వాత సకాలంలో ఈ గనుల నుంచి ఉత్పత్తి ప్రారంభించేలా చూడాలన్నారు.

వీటితో 2021-22 లో సింగరేణి సంస్థ 750 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తుందని సీఎండీ శ్రీధర్ ఆశాభావం వ్యక్తంచేశారు. 2022-23 సంవత్సరంలో ప్రారంభించాల్సి ఉన్న అయిదు గనులకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించాలని ఆదేశించారు. వీటిలో ఎంవీకే ఓసీ (వార్షిక లక్ష్యం 25 లక్షల టన్నులు), గోలేటి ఓసీ (35 లక్షల టన్నులు), జేకే ఓసీ (రోంపేడు, 25 లక్షల టన్నులు), తాడిచర్ల ఓసీ-2 (50 లక్షల టన్నులు), పెనగడప ఓసీ (15 లక్షల టన్నులు), న్యూ పాత్రపాద (ఒడిశా) గనుల ప్రతిపాదనలు, అనుమతులకు సంబంధించిన విషయాలపై అధికారులతో చర్చించారు. ఈ గనులకు అనుమతులు లభించిన అనంతరం నిర్దేశిత లక్ష్యాలు సాధిస్తే 2023-24 నాటికి సింగరేణి సంస్థ 850 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధిస్తుందని పేర్కొన్నారు.

ఈ మూడేళ్ల కాలంలో పాత గనులు కొన్ని మూత పడుతున్న నేపథ్యంలో సింగరేణి సంస్థ ఏటా 50 లక్షల టన్నులు ఉత్పత్తిని పెంచుకుంటూ ముందుకు సాగడానికి కొత్త గనులను ప్రారంభించడం అత్యవసరమని... దీనిని దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు కొత్త గనులు ప్రారంభించడానికి సంబంధించిన అనుమతులకు ఇప్పటి నుంచే కృషిచేయాలని సీఎండీ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఏడాదికి 70 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యం: సీఎండీ ఎన్‌.శ్రీధర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.