సికింద్రాబాద్ సింధి కాలనీలో ఒక పాజిటివ్ కేసు రావడం వల్ల అధికారులు కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. 14 రోజుల నుంచి ఇక్కడ ఎలాంటి కేసు నమోదు కాకపోవడం వల్ల ఈరోజు కంటైన్మెంట్ జోన్ ఎత్తివేశారు.
14 రోజుల క్వారంటైన్లో తమకు సేవలందించిన వైద్య, పోలీసు సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను సింధి కాలనీవాసులు సన్మానించారు. వారికి తెరాస మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ దంపతులు నూతన వస్త్రాలు అందజేశారు.
ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనాను తరిమికొట్టేందుకు ప్రభుత్వానికి సహకరించాలని శ్రీనివాస్ కోరారు.