కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ఫోన్లో బెదిరించిన షేక్ ఇస్మాయిల్ అనే వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు . కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందు కిషన్ రెడ్డికి మే 24న గుర్తు తెలియని వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది. దూషిస్తూ ,అంతు చూస్తానంటూ ఫోన్లో బెదిరించాడు . జూన్ 12న కిషన్ రెడ్డి ప్రతినిధులు సీసీఎస్ లో ఫిర్యాదు చేయగా , పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు . కడప జిల్లాకు చెందిన షేక్ ఇస్మాయిల్ ఫోన్ చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. అతడు రెండేళ్ల క్రితం దుబాయ్‌కి వెళ్లి , అక్కడ కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. సామాజిక మాధ్యమాల్లో కిషన్ రెడ్డి ప్రసంగం విని ద్వేషం పెంచుకుని... కువైట్ నుంచే ఫోన్ చేసి బెదిరించాడు. కొద్ది రోజుల క్రితం కడపకు వచ్చాడని సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇస్మాయిల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
ఇవీ చూడండి;రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు