సికింద్రాబాద్ సుభాష్ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వంశీ అనే విద్యార్థిపై దుండగులు దాడి చేశారు. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఖానాజి గూడా శివనగర్‌లో వంశీ అనే విద్యార్థి ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. బ్లేడ్‌తో బాధితుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడటం వల్ల తీవ్ర రక్తస్రావం జరిగింది. ఒక్కసారిగా ఎనిమిది మంది దుండగులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వంశీపై దాడికి గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు.
మూడు చోట్ల బ్లేడ్‌తో దాడులు !!
గతంలో ఏమైనా గొడవలున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వంశీని లోతుకుంటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు.. శరీరంపై మూడు చోట్ల బ్లేడుతో దాడికి పాల్పడ్డ గాయాలను వైద్యులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడ్డ వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇవీ చూడండి : బాలింత మృతి.. ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లపై దాడి