తెరాస సభ్యత్వం కలిగి ఉండడం గర్వకారణంగా భావిస్తున్నానని ఉపసభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. అడ్డగుట్టలోని సభ్యత్వ నమోదులో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. రూ. 100 రుసుం చెల్లించి స్థానిక కార్పొరేటర్ లింగాల ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ నుంచి పద్మారావు గౌడ్ సభ్యత్వాన్ని స్వీకరించారు.
సికింద్రాబాద్ నియోజకవర్గంలో తెరాస సభ్యత్వం జోరుగా సాగుతోందని ఉపసభాపతి వివరించారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదులో సికింద్రాబాద్ అగ్రస్థానంలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు డిప్యూటి స్వీకర్.
ఇదీ చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థిగా సురభి వాణీదేవి