కరోనా ప్రభావం సికింద్రాబాద్ క్లబ్‌పైనా పడింది. 1898లో ప్రారంభమైన ఈ చారిత్రక క్లబ్ 142సంవత్సరాల క్లబ్ చరిత్రలోనే మొదటిసారిగా తాత్కాలికంగా మూతపడింది. దాదాపు 22ఎకరాల్లో విస్తరించి ఉన్న సికింద్రాబాద్ క్లబ్‌కు జంటనగరాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఇక్కడ ఉండే లగ్జరీ గదులు, స్విమ్మింగ్ పూల్, వివిధ రకాల ఆట స్థలాలు, పసందైన వంటకాలు సభ్యులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అందుకే ఇక్కడికి కేవలం క్లబ్ సభ్యులేకాకుండా దేశ, విదేశీ పర్యాటకులు కూడా వచ్చి విడిది చేస్తుంటారు.
అయితే కరోనా వైరస్ ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో మొదటిసారిగా ఈ క్లబ్ మూతపడింది. ఇప్పటికే ముందుగానే విదేశీయులు బుక్ చేసుకున్న రిజర్వేషన్లను కూడా రద్దు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం నలుగురు కరోనా బాధితులు గాంధీలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చూడండి:- కరోనా నివారణకు కేంద్రం 15 సూచనలు