ETV Bharat / state

నేటి నుంచి ఆరోగ్య సిబ్బందికి రెండో డోసు వ్యాక్సినేషన్ - 2nd dose of COVID vaccine from today

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఆరోగ్య సిబ్బందికి రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి సుమారు మూడు లక్షల మందికిపైగా సిబ్బంది.. వ్యాక్సినేషన్ కోసం కోవిన్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసుకోగా... కేవలం 58.3 శాతం మంది మాత్రమే తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక తొలిడోసు తీసుకున్న వారికి ఇవాళ్టి నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు వైద్యారోగ్యశాఖ సమాయత్తమైంది.

second-dose-vaccination-for-health-workers-from-today-in-telangana
నేటి నుంచి ఆరోగ్య సిబ్బందికి రెండో డోసు వ్యాక్సినేషన్
author img

By

Published : Feb 13, 2021, 4:53 AM IST

Updated : Feb 13, 2021, 5:00 AM IST

దేశవ్యాప్తంగా గత నెల 16 నుంచి ప్రారంభమైన కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా.. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఇచ్చే తొలి డోసు వ్యాక్సినేషన్‌ని వైద్యారోగ్యశాఖ పూర్తి చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు, బోధనాసుపత్రులు సహా ఆరోగ్య సిబ్బంది.. మొత్తం 3లక్షల 31 వేల 124మంది కోవిన్ సాఫ్ట్ వేర్‌లో వ్యాక్సినేషన్ కోసం నమోదు చేసుకున్నారు.

నాలుగు వారాలు పూర్తి

ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న వారు లక్షా 76వేల 728 మంది కాగా.. ప్రైవేటుకి సంబంధించిన లక్షా 54వేల 396 మంది ఉన్నారు. ఫిబ్రవరి 5 వరకు సాగిన ప్రక్రియలో భాగంగా మొత్తం లక్షా 93 వేల 485 మంది హెల్త్‌కేర్ వర్కర్లు తొలి డోస్ టీకా తీసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్న వారిలో కేవలం 58.3 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. తొలి డోసు టీకా ప్రారంభించి నాలుగు వారాలు పూర్తయినందున ఇవాళ్టి నుంచి రెండో డోసు వ్యాక్సిన్‌ ఇచ్చే కార్యక్రమానికి వైద్యారోగ్యశాఖ శ్రీకారం చుట్టింది.

33 శాతం మందికి

రాష్ట్రంలో ఈనెల ఆరో తేదీ నుంచి ప్రారంభమైన ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ సైతం శుక్రవారంతో ముగిసింది. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ విభాగాలకు చెందిన లక్షా 88 వేల 402మంది సిబ్బంది వ్యాక్సిన్ కోసం కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదుచేసుకున్నారు. ఇప్పటి వరకు 84వేల 340 మంది మాత్రమే టీకా తీసుకున్నారు. వ్యాక్సిన్‌ కోసం నమోదు చేసుకున్న వారిలో 33 శాతం మంది మాత్రమే టీకా తీసుకున్నట్టు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

వారికి అవకాశం లేదు

రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 2లక్షల 56వేల 895 మందికి తొలి డోసు టీకా పూర్తయింది. టీకా రెండో డోసు ప్రక్రియ కోసం 140 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలిరోజు మొత్తం 3,975 మందికి రెండో డోస్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలిడోసు తీసుకున్న వారిలో తీవ్ర దుష్పరిణామాలు ఎదురైన వారికి రెండో డోస్ టీకా ఇచ్చే అవకాశం లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : విహారయాత్రలో విషాదం.. విశాఖలో నలుగురు మృతి

Last Updated : Feb 13, 2021, 5:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.