'నియో వైజ్ తోకచుక్క'ను వీక్షించడం వలన ఎలాంటి అరిష్టాలు, అంటువ్యాధులు ప్రబలడం లాంటివి జరగవని ఔత్సాహిక శాస్త్రవేత్త తుమ్మల శ్రీకుమార్ స్పష్టంచేశారు. ఖగోళ రహస్యాలు ఛేదించేందుకు పరిశోధకులకు ఇదో అరుదైన అవకాశమని ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఆయన తెలిపారు.
జులై 14నుంచి కనిపించే ఈ తోకచుక్క నెలరోజుల వరకు ఉంటుందన్నారు. ప్రతిరోజు 5 కిలోమీటర్ల చొప్పున 20 నిమిషాలకు పైగా పెరుగుతూ కనువిందు చేస్తుందని ఆయన తెలిపారు. ఈనెల 22వ తేదీన భూమికి అతి దగ్గరగా వస్తుందని చెప్పారు. వాయువ్య దిశగా సూర్యాస్తమయం అయిన వెంటనే 20 డిగ్రీల కోణంలో చూస్తే తోక చుక్క స్పష్టంగా కనిపిస్తుందన్నారు.
ఇదీ చూడండి: భర్త ఇంటి ఎదుట కొడుకుతో కలిసి భార్య నిరసన