ETV Bharat / state

నేటి నుంచి విధుల్లోకి ఉపాధ్యాయులు, అధ్యాపకులు

జులై 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినందున ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. ఈ రోజు నుంచి ఉపాధ్యాయలు, అధ్యాపకులు హాజరు కావాలని విద్యాశాఖ ఆదేశించింది.

schools, colleges
పాఠశాలలు, జూనియర్ కళాశాలలు
author img

By

Published : Jun 25, 2021, 5:11 AM IST

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు నేడు తెరుచుకోనున్నాయి. ఇవాళ్టి నుంచి పాఠశాలల్లో ఉపాధ్యాయలు, కాలేజీల్లో అధ్యాపకులు విధులకు హాజరు కానున్నారు. కొవిడ్ తీవ్రత కారణంగా మార్చి నెలలో మూతపడ్డాయి. జులై 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినందున... నేటి నుంచి ఉపాధ్యాయలు, అధ్యాపకులు హాజరు కావాలని విద్యా శాఖ ఆదేశించింది.

పాఠశాలలు, కళాశాలల ఆవరణను శుభ్రం చేయించడంతో పాటు... ఆన్​లైన్ లేదా ఆఫ్​లైన్ తరగతులకు అవసరమైన సన్నాహాలను బోధన, బోధనేతర సిబ్బంది చేయనున్నారు. విద్యార్థులను విద్యా సంస్థల్లో చేర్చేందుకు ప్రోత్సహించాలని విద్యా శాఖ పేర్కొంది. అయితే కాలేజీల్లో అతిథి ఉపాధ్యాయులు, పాఠశాలల్లో విద్యా వాలంటీర్లు, సమగ్ర శిక్ష అభియాన్ పార్ట్ టైం ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోకుండా తరగతులు ప్రారంభిస్తే భారం పడుతుందని ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: Jalayagnam: నీటిపారుదల ప్రాజెక్టు పనుల పూర్తికి గడువు పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.