ప్రజా ఉద్యమాలతో సాధించుకున్న సంక్షేమ చట్టాలను రెండు తెలుగు రాష్ట్రాలు పటిష్ఠంగా అమలు చేయకపోవడం విచారకరమని మాజీ ఐఏఎస్ గోపాల్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి... నిధుల కేటాయింపు... ఖర్చులపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
సంక్షేమ రంగాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని... ఆయా రంగాలకు కేటాయించిన నిధులను ఇతర రంగాలకు మళ్లించి... బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. దీనివల్ల ప్రజలు విద్య వైద్య రంగానికి దూరమయ్యారని చెప్పారు. చట్టాలు, సంక్షేమ పథకాల అమలు కోసం ప్రజా ఉద్యమం, న్యాయ పోరాటం చేయడం తప్ప మరో మార్గం లేదని పేర్కొన్నారు.
ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి కేటాయించిన నిధుల మళ్లింపుపై సమావేశంలో పాల్గొన్న పలు ప్రజా సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు.
ఇదీ చూడండి : కేంద్రంపై పోరుకు కాంగ్రెస్ సమాయత్తం!