చర్లపలి కేంద్ర కారాగారానికి సమత దోషులు... - SAMATHA CASE VICTIMS MOVED TO CHERLAPALLI CENTRAL JAIL
సమతకేసులో ఉరిశిక్ష ఖరారైన దోషులు షేక్‌బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ ముఖ్దాంలను గురువారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితులు, రెండేళ్ల వరకు శిక్షలు విధించిన ఖైదీలను మాత్రమే ఉంచటానికి వీలుంది. ఉరి శిక్ష విధించిన రోషులను ఇక్కడ ఉంచటానికి నిబంధనలు వర్తించని కారణంగా అర్ధరాత్రి పటిష్ఠ పోలీసు బందోబస్తుతో ప్రత్యేక వాహనంలో చర్లపల్లి జైలుకు తరలించారు.