ETV Bharat / state

Success Story: అమ్మ కల నిజం చేయాలని... కదిలిన వనితలు - వైష్ణవి వీరవంశం, ఝాన్సీ లావేటి స్టోరీ

చిన్నప్పటి నుంచి అమ్మల కష్టం చూశారు. జీవితంలో ఉన్నత స్థాయిలో నిలవాలన్న వారి ఆశలను నిజం చేయాలనుకున్నారు. అందుకు సెయిలింగ్‌ రూపంలో అవకాశం వచ్చింది. తమ సత్తా ప్రపంచానికి చూపడానికి ఇటలీ పయనమయ్యారు. ప్రపంచ దిగ్గజాలు జీవితంలో ఒక్కసారైనా సెయిలింగ్‌ చేయాలనుకునే రివాడెల్‌ గార్డా సరస్సులో పోటీ. విజయం సాధించి, కన్న తల్లులతోపాటు మాతృదేశానికి గర్వకారణంగా నిలుస్తామంటున్నారు. వారే  వైష్ణవి వీరవంశం, ఝాన్సీ లావేటి.

sailors Vaishnavism Veera Vamsam and Jhansi Laveti success story in telugu
Success Story: అమ్మ కల నిజం చేయాలని... కదిలిన వనితలు
author img

By

Published : Jun 19, 2021, 11:51 AM IST

.

తనని విమానమెక్కిస్తా

- వైష్ణవి వీరవంశం

మ్మ లలిత, ఇళ్లలో పనిచేస్తుంది. నాన్న హనుమంతరావు మెకానిక్‌. నన్నూ, అక్కని బాగా చదివించాలన్నది అమ్మ కల. నేను మూడో తరగతికి వచ్చేసరికి నాన్న అనారోగ్యంతో మంచానపడ్డాడు. అప్పుడప్పుడు అమ్మకు ఫిట్స్‌ కూడా వచ్చేవి. ఆమె రెక్కల కష్టంతోనే కుటుంబం గడిచేది. నాన్నకు వైద్యం, ఇంటి ఖర్చులతో పాటు ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వపాఠశాలలో చేర్పించింది. అయిదోతరగతి చివర్లో హైదరాబాద్‌ యాట్‌ క్లబ్‌ వాళ్లు సెయిలింగ్‌లో శిక్షణనిస్తామన్నారు. అమ్మ మొదట ఒప్పుకోలేదు. టీచర్‌ మాట్లాడాక సరేనంది. 40 మంది వెళ్లగా, ముగ్గురు ఎంపికయ్యారు. వాళ్లలో నేను, ఝాన్సీ ఉన్నాం. క్లబ్‌ నిర్వాహకులు సుహీంషేక్‌ మమ్మల్ని ప్రైవేటు పాఠశాలలో చేర్పించి, హుస్సేన్‌సాగర్‌లో శిక్షణనిచ్చారు.

అది 2017, నాలుగైదు నెలల్లోనే తెలంగాణ మాన్‌సూన్‌ రెగెట్టా జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నా. అప్పుడు నా వయసు తొమ్మిదేళ్లు. అదే ఏడాది కృష్ణపట్నంలో అండర్‌ 15 పోటీలకు వెళ్లా. అప్పటివరకు సముద్ర కెరటాల్లో సెయిలింగ్‌ అనుభవం లేకపోవడంతో భయపడ్డా. ముందుగానే అక్కడికి వెళ్లి ప్రాక్టీస్‌ చేశా. 200మందితో పోటీపడి బంగారుపతకాన్ని సాధించా. ఈ నాలుగేళ్లలో ఒక బంగారు, రెండు వెండి పతకాలతోపాటు సెయిలింగ్‌ సబ్‌జూనియర్స్‌లో మన దేశంలో రెండో స్థానాన్ని దక్కించుకున్నా. జులైలో ఇటలీలో జరుగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యా. అక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి ముందుగానే వెళుతున్నాం. శారీరక సామర్థ్యం పెంచుకోవడానికి ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్స్‌, విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నా. రోజూ 2 గంటలు వ్యాయామం, 4 గంటలు సెయిలింగ్‌ సాధన చేస్తా. ఖర్చంతా హైదరాబాద్‌ యాట్‌ క్లబ్‌ నిర్వాహకులు భరిస్తున్నారు. పుదుచ్చేరిలో పోటీలకు ముందు సాధనలో నీటి అడుగున ముళ్లకంప పాదాలకు గుచ్చుకుంది. తగ్గడానికి మూడు రోజులుపట్టింది. అయినా పోటీల్లో పాల్గొని విజేతనయ్యా. ఇలాంటి అనుభవాలను మర్చిపోలేను. పేద కుటుంబంలో పుట్టిన నేను పోటీలకు పోర్చుగల్‌, స్పెయిన్‌ దేశాలకు వెళ్లడం కలలా అనిపిస్తుంది. ఓడిపోతే వైఫల్యాలను గుర్తించి, సరిదిద్దుకుంటా. ఒలింపిక్‌, ఏషియన్‌ గేమ్స్‌లో పోటీపడాలనుంది. అమ్మను విమానంలో విదేశాలకు తీసుకెళ్లడం నా కల. సెయిలింగ్‌ నేర్పిన గురువు, దేశం గర్వించేలా విజయాలను సాధించడం నా ఆశయం.

నాలుగు నుంచి మొదటి ర్యాంకుకు

- ఝాన్సీప్రియ లావేటి

పుట్టింది విజయవాడ, పెరిగింది హైదరాబాద్‌. అమ్మ రమణ, నాన్న దుర్గారావు. మేమిద్దరం ఆడపిల్లలం. నాకు పదేళ్లు నిండక ముందే నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. కుటుంబ భారమంతా అమ్మదే. తను పదోతరగతి చదివింది. మాకోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో హౌస్‌కీపర్‌గా చేరింది. మమ్మల్ని చదివించి ఉన్నతోద్యోగంలో చూడాలన్నది తన ఆశ. అక్కా, నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేవాళ్లం. హైదరాబాద్‌ యాట్‌ క్లబ్‌ మా జీవితాల్ని మలుపు తిప్పింది. అమ్మ చదువు పాడవుతుందని వద్దన్నా తర్వాత మాష్టారు సుహీం షేక్‌ మాట్లాడాక ఒప్పుకుంది. ఆయన నన్ను రసూల్‌పురాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించి, హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్‌ శిక్షణనిచ్చారు. నాకప్పుడు పదేళ్లే.

ఆప్టిమిస్ట్‌ బోటును మొదటిసారి నడిపినప్పుడు బ్యాలెన్స్‌ చేయడం కష్టమనిపించింది. తరువాత ఏడాదికే నెల్లూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లా. పోటీకి కొన్ని రోజులముందు అక్కడికి వెళ్లి సాధన చేశా. ఎక్కువసేపు సముద్రంలో ఉన్నప్పుడు అలవాటు లేక వాంతులయ్యేవి. 2019లో అయోడా ఏషియన్‌ ఓషన్‌ గేమ్స్‌ అండర్‌ 15 పోటీలకు ఎంపికయ్యా. మొదటిసారి విమానాన్ని నేరుగా చూశా. నేను విదేశానికి వెళ్లడం చూసి అమ్మ సంతోషం పట్టలేకపోయింది. కానీ అక్కడ అనుకున్న ర్యాంకు సాధించలేకపోయా. మూడు నెలల తర్వాత పోర్చుగల్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుని స్పెయిన్‌లో జరిగిన పోటీల్లో 44వ ర్యాంకు సాధించా. ముంబయిలో గతేడాది డిసెంబరులో యాట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా తరఫున జరిగిన పోటీల్లో నాలుగు నుంచి మొదటి ర్యాంకుకు చేరుకున్నా. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో అండర్‌ 16కు ఎంపికైనందుకు సంతోషంగా ఉంది.

మంచిమాట

- కంగనా రనౌత్‌, బాలివుడ్‌ నటి

మహిళ అయినంత మాత్రాన ఆధారపడనవసరం లేదు. నిరంతరం ఎవరూ సాయం చేయరు కూడా. మిమ్మల్ని మీరే చక్కబెట్టుకోవాలి. జీవనమాధుర్యం అప్పుడే అర్థమవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.