నేటితరం అంతా విద్యావంతులైనా ప్రకృతిని నాశనం చేస్తున్నామని సచ్చిదానంద యోగా మిషన్ సంస్థాపక అధ్యక్షులు సాద్వి నిర్మలానంద యోగ భారతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 26న రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మేకాన్గడ్డ శ్రీ వేణుగోపాల స్వామి మందిర గోశాలలో సచ్చిదానంద యోగా మిషన్, పతంజలి యోగమఠం ఆధ్వర్యంలో రుషికులం వేదగురుకులం ప్రారంభోత్సవానికి సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరించారు. కార్యక్రమంలో యోగ మిషన్ కార్యనిర్వాహక కార్యదర్శులు డాక్టర్ ధర్మతేజ, ధర్మపాల్ పాల్గొన్నారు. నైపుణ్య అభివృద్ధి శిక్షణ భవనం ప్రారంభోత్సవం జరగనుంది. కార్యక్రమానికి మాజీ ఎంపీ బస్వరాజ్ పాటిల్, ఆర్ష విద్యాపీఠం అధిపతి స్వామి ప్రణవానంద సరస్వతి, భారతీయం సంస్థాపక అధ్యక్షులు మాత సత్యవాణి తదితరులు హాజరవుతారని తెలిపారు.
'విద్యావంతులైనా ప్రకృతిని నాశనం చేస్తున్నాం' - 'విద్యావంతులైనా పకృతిని నాశనం చేస్తున్నాం'
శారీరక ఉన్నతితో సహా ప్రకృతిని సంరక్షించుకోవల్సిన అవసరం ఎంతైన ఉందని సచ్చిదానంద యోగా మిషన్ సంస్థాపక అధ్యక్షులు సాద్వి నిర్మలానంద యోగ భారతి తెలిపారు. పూర్వకాలంలో నిరక్షరాస్యులైనా ప్రకృతిని కాపాడారని ప్రస్తుతం విద్యావంతులైనా ప్రకృతిని నాశనం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
!['విద్యావంతులైనా ప్రకృతిని నాశనం చేస్తున్నాం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3343684-thumbnail-3x2-sadvi.jpg?imwidth=3840)