ETV Bharat / state

Telangana Rythu Bandhu Funds 2023 : రైతుబంధు నిధుల విడుదల​.. రైతుల ఖాతాల్లో జమ

Rythu Bandhu Funds Released In Telangana : రైతుబంధు పథకం కింద పెట్టుబడి రాయితీ సాయం పంపిణీ ప్రారంభమైంది. ఈ ఏడాది వానా కాలం ప్రారంభమైన నేపథ్యంలో తొలిరోజు రైతుబంధు నిధులు రూ.642.52 కోట్లు జమ అయ్యాయి. ఎకరాల వారీగా ప్రతి రోజు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి హరీశ్​రావు మరోమారు రైతుబంధు పండగ ప్రారంభమైందని ట్వీట్​ చేశారు.

Rythu Bandhu funds Release
Rythu Bandhu funds Release
author img

By

Published : Jun 26, 2023, 5:00 PM IST

Updated : Jun 26, 2023, 8:50 PM IST

Niranjan Reddy comments on Rythu Bandhu funds : సీఎం కేసీఆర్ ప్రకటించిన దాని ప్రకారం రైతుబంధు నిధుల జమ ప్రారంభం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి అన్నారు. ఎకరాల వారీగా ప్రతి రోజు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ శాఖ ద్వారా అందుతున్న సూచనలు పాటించాలని సూచించారు. రైతు బంధు నిధులు విడుదల చేయడం పట్ల సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావుకు.. నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతు బంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడాది వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తొలిరోజు ఎకరాలోపున్న రైతులకు 642.52 కోట్ల రూపాయల నిధుల్ని రైతుబంధు కింద వారి ఖాతాల్లో జమ చేశారు. సుమారు 22లక్షల 55వేల 81మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేశారు.

"రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభమైంది. తొలిరోజు రైతుల ఖాతాల్లో రూ.642.52 కోట్లు నిధులు జమ చేశాం. 22.55 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ. ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నాం. వ్యవసాయ శాఖ ద్వారా అందుతున్న సూచనలు రైతులు పాటించాలి"- నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి

రైతుబంధు నిధుల విడుదల​.. రైతుల ఖాతాల్లో జమ

Harishrao comments on Rythu Bandhu : రైతు బంధు నిధులు విడుదల కావడం పట్ల ఆర్ధికశాఖ మంత్రి హరీశ్​రావు స్పందించారు. మరోమారు రైతుబంధు పండగ ప్రారంభమైందని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్​ చేశారు. ఇవాళ్టి నుంచి రైతుబంధు ద్వారా లక్షలాది రైతులకు పంట పెట్టుబడి సాయం అందుతుందని పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సే ముఖ్యమంత్రి కేసీఆర్​కు ప్రాధాన్యమని అభిప్రాయపడ్డారు. రైతుల ఖాతాల్లో ఇవాళ రూ.645 కోట్ల 52 లక్షలు జమ చేసినట్లు హరీశ్ రావు తెలిపారు. ఎకరాలోపు భూమి ఉన్న 22లక్షల 55వేల 81 మంది రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

Telangana Rythu Bandhu 2023 : రాష్ట్రంలో భూమి పట్టా గల అర్హులైన రైతుకు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇటీవల కాలంలో ధరణి పోర్టల్‌లో పార్ట్-2లో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారానికి నోచుకున్న క్రమంలో కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం వచ్చిన రైతులకు కూడా ఈసారి రైతుబంధు కింద సాయం అందిస్తుంది. సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు ఈసారి లక్షా 50 వేల మంది పోడు రైతులకు చెందిన 4 లక్షల ఎకరాలకు వర్తింపజేసి గిరిజన రైతులకు రైతుబంధు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

  • Rythu Bandhu Festival begins!

    Lakhs of farmers in Telangana will receive investment support under #RythuBandhu scheme starting today.

    ₹645.52 crore was credited today to Farmers whose development and well being is the top priority for Hon’ble CM #KCR Garu.

    On the very first… pic.twitter.com/cg5xM8q1OR

    — Harish Rao Thanneeru (@BRSHarish) June 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

Last Updated : Jun 26, 2023, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.