ETV Bharat / state

రైతుబంధు అందేదెలా..!

దేవుడు వరమిచ్చినా.. పూజారి అడ్డుపడ్డట్లుగా ఉంది.. రైతు బంధు పథకం. రైతులకు నిధులు వచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నా... నిబంధనల సాకుతో.. అధికారులు మోకాలడ్డుతున్నారు. ఫలితంగా వారి కటాక్షం కోసం కార్యాలయాల వద్ద పడిగాపులు  పడుతున్నారు.

అధికారి వద్ద రైతులు
author img

By

Published : Feb 20, 2019, 9:54 PM IST

రైతుబంధు అందేదెలా
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు.. ఇటీవల కేంద్రం ప్రకటించిన కిసాన్ సమ్మాన్ యోజన పథకాలు అందరికి చేరడం లేదు. భూరికార్టుల ప్రక్షాళనలో జాప్యం, అంతర్జాలంలో నమోదుకాక, ఆధార్​తో అనుసంధానం చేయక, అధికారులు సరిగా స్పందించక..ఇలా ఎన్నో అవరోధాలు అన్నదాతలకు ఈ సాయం దక్కకుండా చేస్తున్నాయి.రెండో విడతలోనూ అంతేనా..! మొదటి విడతలో చెక్కులు అందుకోలేకపోయిన వారు..రెండో విడతలోనైనా అందుకుంటామని ఆశించినా ఫలితం లేకుండా పోతోంది.కార్యాలయాల వద్ద రైతుల పడిగాపులు మహబూబ్​నగర్​ జిల్లాలో 3 లక్షల 85 వేల ఖాతాలుండగా.. దాదాపు 85 వేల ఖాతాలకు డిజిటల్​ సంతకాలు కాలేదు. పాసు పుస్తకాల మంజూరులో జాప్యం చోటుచేసుకుంది. ప్రతిఫలంగా రైతుబంధు చెక్కులు అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో లక్షా 78 వేల ఖాతాలున్నాయి. 45 వేల ఖాతాలకు డిజిటల్​ సంతకాలు లేక.. మరో 12 మంది రైతులకు పార్ట్​-బి అందక రైతుబంధుకు నోచుకోలేదు. వనపర్తి జిల్లాలోను ఇలాంటి పరిస్థితులే రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

నాగర్​కర్నూల్​ జిల్లాలో 3 లక్షల ఖాతాలున్నాయి. సాంకేతిక సమస్యలతో సుమారు 63 వేల మంది రైతుల వివరాలు అసలు ధరణి వెబ్​సైట్​లోనే నమోదుకాలేదు. మరో 64 వేల ఖాతాలకు అధికారులు సంతకాలు చేయలేదు. మిగతావి ఆధార్​లో నమోదు కాక, వేలిముద్రలు సరిపోక, మరికొన్నింటికి పార్టు-బి అందక పాసు పుస్తకాల్లో మంజూరు కాలేదు. ఫలితంగా రైతుబంధు చెక్కులు అందుకోలేకపోయారు.

ఏదోరకంగా అన్నదాతను ఆదుకోవాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. భూరికార్డులను ప్రక్షాళన వేగవంతం చేయాల్సి ఉన్నా.. వారి అలసత్వం రైతుల పాలిట శాపంగా మారుతోంది. వీటన్నింటిపైనా ఉన్నాతాధికారులు దృష్టిసారించి తమ సమస్య తీర్చాలని అన్నదాతలు కోరుతున్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.