విధుల్లో చేరేందుకు సిద్ధమని హైదరాబాద్ పాతబస్తీ ఫారూఖ్ నగర్, ఫలక్‌నుమా డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు. 52 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని మేనేజర్‌కు లిఖిత పూర్వకంగా రాసుకొచ్చిన పేపర్లను అందించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని మేనేజర్ పేర్కొన్నారు.
ఇవీచూడండి: వేతనం మినహాయించుకునే అధికారం ఆర్టీసీకి ఉంది: అదనపు ఏజీ