ETV Bharat / state

RTC: రేపటి నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆర్టీసీ సేవలు - telangana varthalu

రేపటి నుంచి రాష్ట్రంలో ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. లాక్​డౌన్​ విరామ సమయం పెరగడంతో బస్సులను తిప్పే సమయాన్ని పెంచామని ఆర్టీసీ ఆపరేషన్స్​ ఈడీ తెలిపారు.

rtc buses
ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరగనున్న ఆర్టీసీ బస్సులు
author img

By

Published : Jun 9, 2021, 4:50 PM IST

లాక్​డౌన్ విరామ సమయం పెరగడంతో ఆర్టీసీ బస్సులను తిప్పే సమయాన్ని పెంచామని ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి పేర్కొన్నారు. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలకు నడిపే బస్సులను తిప్పనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,600 బస్సులను మధ్యాహ్నం 2గంటల వరకు తిప్పుతున్నామని... వాటినే సాయంత్రం 6 గంటల వరకు తిప్పుతామని స్పష్టం చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీఎస్​ఆర్టీసీ సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయని గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

ప్రభుత్వం ఈనెల 10వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్​ను ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి మరుసటిరోజు 5 గంటల వరకు విధించింది. ఈ నేపథ్యంలో లాక్​డౌన్ విరామ సమయంలో సిటీ బస్సులను తిప్పుతామని ఈడీ తెలిపారు. గ్రేటర్ పరిధిలోని బస్ పాస్ కౌంటర్లు అన్నీ.. ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పనిచేస్తాయని ఈడీ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: Metro services: హైదరాబాద్ మెట్రో సేవల సమయం పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.