ETV Bharat / state

బండ్లగూడలో రహదారి భద్రతా వారోత్సవాలు - Road safety weekends at Bundlaguda RTA office

31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు బండ్లగూడలో ఘనంగా నిర్వహించారు.

Road safety weekends at Bundlaguda RTA office
బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయంలో రహదారి భద్రతా వారోత్సవాలు
author img

By

Published : Jan 31, 2020, 7:19 PM IST

హైదరాబాద్​ బండ్లగూడలోని దక్షిణ మండలం ఆర్టీఏ కార్యాలయంలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. ఎమ్మెల్యే నిధుల నుంచి నియోజకవర్గంలోని ప్రధాన కూడలిలలో సీసీ కెమెరాలు, స్పీడ్​ మీటర్​ చెకింగ్​ అమర్చడానికి చర్యలు తీసుకుంటానని ఒవైసీ తెలిపారు.

ద్విచక్రవాహనదారులంతా శిరస్త్రాణం లేకుండా వాహనం నడపకూడదని సూచించారు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు అంబులెన్స్ వస్తుంటే విధిగా దారి ఇవ్వాలని పేర్కొన్నారు. ఆర్టీఏ కార్యాలయం పరిధిలోని రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్​ సిబ్బందితో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నేతలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయంలో రహదారి భద్రతా వారోత్సవాలు

ఇదీ చూడండి:హారన్ వేశారో... ఆగి తీరాల్సిందే

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.