డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, వేగనియంత్రణ పాటించాలని, ద్విచక్ర వాహనం నడిపేవారు... వెనుక కూర్చున్నవారు విధిగా శిరస్త్రాణం ధరించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన 31వ రోడ్డు భద్రతా వారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలిస్తే వారి ప్రాణాలు కాపాడొచ్చని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆర్టీసీ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని... సంస్థను కాపాడడానికి సీఎం తీసుకున్న చర్యలు ఫలితాలనిస్తాయని పువ్వాడ అన్నారు. అధికారులు, సిబ్బంది సంస్థను లాభాల బాట పట్టించాలని మంత్రి ఆకాక్షించారు. ప్రమాదాల రహితంగా బస్సులు నడిపిన వివిధ డిపోలకు చెందిన డ్రైవర్లకు మంత్రి నగదు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, రవాణ శాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.