ETV Bharat / state

అర్హతలేని వైద్యులతో చికిత్స.. జీవితాలు ఆగమాగం - ఆర్​ఎంపీ వైద్యుల తాజా వార్తలు

కొవిడ్​ భయంతో ఏ చిన్న నలతగా అనిపించిన వైద్యుల దగ్గరికి పరుగెత్తున్నారు ప్రజలు. నిపుణులైన వైద్యులు అందుబాటులో లేక అర్హతలేని వైద్యులను ఆశ్రయిస్తున్నారు. తెలిసీ తెలియని వైద్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

rmp
అర్హతలేని వైద్యులు
author img

By

Published : Apr 24, 2021, 9:59 AM IST

* మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం గిడిపెద్దాపూర్‌ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి (40) జ్వరం రావడంతో వారం రోజులపాటు స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడి దగ్గర చికిత్స తీసుకున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో కరోనా పరీక్ష చేయించుకోగా మంగళవారం పాజిటివ్‌ వచ్చింది. ఈలోపు పరిస్థితి తీవ్రం కావడంతో బుధవారం ఉదయం ఇంట్లోనే ప్రాణాలు వదిలాడు.
* కుమురంభీం జిల్లా రెబ్బన మండలం గోలేటి గ్రామానికి చెందిన యువకుడికి (20) వారం క్రితం జ్వరం వచ్చింది. స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుణ్ని సంప్రదించగా మందులు ఇచ్చి పంపాడు. మంగళవారం ఒక్కసారిగా ఆక్సిజన్‌ శాతం పడిపోవడంతో బెల్లంపల్లి తరలించారు. చికిత్స చేస్తుండగానే బుధవారం మరణించాడు. కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు.

ఒకపక్క అవగాహనా లోపం. మరోపక్క వైద్యుల కొరత కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని బడుగుజనం అల్లాడిపోతున్నారు. నలతగా అనిపించగానే చికిత్స కోసం పరుగులెత్తి.. నిపుణులైన వైద్యులు అందుబాటులో లేక అర్హతలేని వైద్యులను ఆశ్రయిస్తున్నారు. తెలిసీ తెలియని వైద్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చివరి నిమిషంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాల్లోని పెద్దాసుపత్రులకు చేరుతున్న కేసుల్లో చాలావరకూ ఇలాంటివే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సరిపడా వైద్యులు లేకపోవడంతో ఇప్పటికీ ఆర్‌ఎంపీలే దిక్కవుతున్నారు. మామూలు అనారోగ్యం అయితే ఫర్వాలేదు.. ఒకవేళ జబ్బు తగ్గకపోతే నాలుగు రోజులు చూసిన తర్వాత రోగులే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికో, ప్రైవేటు వైద్యుడి వద్దకో వెళతారు. కాని కరోనా విషయంలో అలా కాదు. ప్రతి నిమిషమూ విలువైందే. పైగా ఇది ఎవరిలో ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారి తీస్తుందో నిపుణులు కూడా చెప్పలేకపోతున్నారు. బయటపడుతున్న లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. కరోనా బారిన పడుతున్న వాళ్లలో చాలామంది ఇళ్లలోనే చికిత్స తీసుకొని కోలుకుంటున్నారు. దీన్ని చూసి చాలామంది గుడ్డిగా స్థానిక వైద్యుల్నే నమ్ముతున్నారు. రోగిలో వస్తున్న మార్పుల్ని బట్టి గుర్తించగలిగే నైపుణ్యం ఆర్‌ఎంపీ వైద్యులకు ఉండటం లేదు. దాంతో చూస్తుండగానే కొంతమందిలో కరోనా వికటించి ప్రాణాల మీదకు తెస్తోంది.

వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
గ్రామీణులకు ఇప్పటికీ కరోనా పట్ల అవగాహన ఉండటంలేదు. చాలామంది ఇప్పటికీ మామూలు జ్వరం, జలుబుగానే భావిస్తున్నారు. రెండు మూడు రోజులు చూసిన తర్వాత కాని వైద్యుడి వద్దకు వెళ్లడంలేదు. ప్రభుత్వ ఆసుపత్రి దూరంలో ఉంటే ముందు తమకు అందుబాటులో ఉన్న ఆర్‌ఎంపీని సంప్రదిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలంటే అధికారులు స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి తీవ్రమైతే లక్షణాలు ఎలా ఉంటాయి, అటువంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో జనానికి తెలిసేలా ప్రచారం చేయాలని అంటున్నారు. అంబులెన్సుల్ని అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: గాలి నుంచి ఆక్సిజన్ తయారీ.. మూడు ప్లాంట్లు పంపిన కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.