ETV Bharat / state

అవును.. వాళ్లు బియ్యం ఎగ్గొట్టారు.!.. అయినా కేటాయించండి - telangana news

ప్రభుత్వానికి రైస్ మిల్లర్లు బియ్యం ఎగ్గొట్టిన మాట వాస్తవమేనని కానీ.. వారికి మిల్లు తప్ప వేరే ఆధారం లేదని మిల్లుల సంఘాలు పేర్కొన్నాయి. ఈ సీజన్‌లో వారికి ధాన్యం కేటాయించాలని పౌరసరఫరాల శాఖకు లేఖలు రాశాయి. సంఘాలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు వారికి మద్దతుగా లేఖలు రాశారు. మరి మిల్లులకు ధాన్యం కేటాయింపు విషయంలో అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

rice millers letters to civil supply department
పౌరసరఫరాల శాఖకు రైస్‌ మిల్లర్ల సంఘాల లేఖలు
author img

By

Published : May 24, 2021, 9:39 AM IST

‘గతంలో ధాన్యం కేటాయించగా ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా పక్కదారి పట్టించింది నిజమే. అయినా ప్రస్తుత సీజనులో వారికి తిరిగి ధాన్యం కేటాయించండి’ అంటూ పౌరసరఫరాల శాఖకు రైస్‌ మిల్లర్ల సంఘాల నుంచి లేఖలపై లేఖలు వస్తున్నాయి. ఇందుకోసం అధికారుల చుట్టూ పలువురు మిల్లర్లు ప్రదక్షిణలు చేస్తున్నారు. 2019-20 వ్యవసాయ సీజనులో కేటాయించిన ధాన్యంలో సుమారు 90 మంది మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. రూ.350 కోట్ల విలువ చేసే సుమారు లక్ష మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)కి అందజేయలేదు.

నెల గడిచినా..

మూడు దఫాలు గడువు పొడిగించినా బియ్యం రాకపోవటంతో మరోదఫా గడువు పొడిగించేది లేదని, ఆ బియ్యాన్ని కేంద్రం కోటా(సెంట్రల్‌ పూల్‌)నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ బియ్యం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేస్తూ కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు లేఖ రాసింది. ఈ లేఖ వచ్చి దాదాపు నెల రోజుల కావస్తున్నా ఆ మిల్లర్ల నుంచి బియ్యాన్ని రాబట్టుకునే విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపణలు వస్తున్నాయి.
ఎగనామం పెట్టింది వాస్తవమే
పలు జిల్లాలకు చెందిన మిల్లర్లు బియ్యం ఇవ్వక ఎగవేతదారులు(డిఫాల్టర్లు) అయ్యారు. అయితే ఆ మిల్లర్లకు ధాన్యం మిల్లింగ్‌ మినహా మరో వ్యాపారం లేనందున వారికి బియ్యం కేటాయించాలంటూ ఆయా జిల్లాల, రాష్ట్ర రైస్‌ మిల్లర్ల సంఘాల నుంచి పౌరసరఫరాల శాఖ అధికారులకు లేఖలు వస్తున్నాయి. గతంలో ఎందుకు ఎగనామం పెట్టారు? ఆ బియ్యాన్ని ఎప్పటిలోగా ఇస్తారు? అందుకోసం ఎలాంటి పూచీకత్తు ఇస్తారు? అన్నది ఆ లేఖల్లో ఎక్కడా పేర్కొనడం లేదు. తాజాగా ఇచ్చే ధాన్యానికి మాత్రం ఆయా మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారెంటీ కానీ, సంతకాలు చేసిన ఖాళీ చెక్కులను కానీ తీసుకుని కేటాయించాలని లేఖల్లో పేర్కొంటున్నట్లు తెలిసింది. కొద్ది మొత్తంలో బియ్యం ఇవ్వని మిల్లర్లకు సాధారణంగా ఇస్తున్న ధాన్యం కన్నా అదనపు కోటా ఇవ్వాలని ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు కూడా లేఖలు రాస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ధాన్యం కేటాయింపు విషయంలో అధికారులు ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: కరోనా వేళ ఆపన్న హస్తం.. గౌరవంగా తుది మజిలీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.