ETV Bharat / state

కరోనా ఉద్ధృతిపై రేవంత్​ రెడ్డి ఘాటైన ట్వీట్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తెలంగాణ కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్​ రెడ్డి ట్విట్టర్​లో తీవ్రంగా స్పందించారు.

Revanth reddy Tweet On Corona Spread In Telangana
కరోనా ఉధృతిపై ట్విట్టర్​లో ఘాటుగా స్పందించిన రేవంత్​ రెడ్డి
author img

By

Published : Jul 20, 2020, 4:51 PM IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్న తీరుపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌ ద్వారా తీవ్రంగా స్పందించారు. ప్రజలు కరోనాతో విలవిలలాడుతూ కళ్ల ముందే ప్రాణాలొదులతున్న వైనం తనను కలచివేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

నిత్యం హృదయవిదారక దృశ్యాలు కళ్లెదుటే కనిపిస్తున్నా... ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనసు కరగడం లేదని.. ప్రజల పట్ల కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ నిర్లక్ష్యానికి అంతమెప్పుడని ఎంపీ రేవంత్‌ రెడ్డి ట్విట్టర్​లో ముఖ్యమంత్రి కార్యాలయానికి, ఆరోగ్యశాఖకు లింకు చేసి రేవంత్‌ ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: నరకయాతన: అద్దె ఇళ్లలో ఉండనివ్వరు.. దవాఖానాల్లో చేర్చుకోరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.