RevanthReddy on Telangana Decade Celebrations : రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాల పేరుతో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అధికారులు.. గ్రామస్థాయి నుంచి బీఆర్ఎస్ సేవలో మునిగిపోయారని విమర్శించారు. ఇవి దశాబ్ది వేడుకలు కావని.. దశాబ్ది దగా ఉత్సవాలని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే ఈనెల 22న దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ కార్యచరణ రూపొందించిందని తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా 119 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయాలు లేదా ఎమ్మార్వో కార్యాలయాల్లో వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పీఏసీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించామని వివరించారు. రాజకీయ వ్వవహారాల కమిటీ కన్వీనర్‌గా షబ్బీర్ అలీ ఉంటారని చెప్పారు. 10రోజుల్లో అన్ని మండల కమిటీలు పూర్తి చేస్తామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
RevanthReddy Fires on KCR : ఈ క్రమంలోనే పదేళ్లలో సీఎం కేసీఆర్ అటకెక్కించిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.. ఇందులో భాగంగా కేజీ టూ పీజీ విద్య, ఫీజు రీయంబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం.. డబుల్ బెడ్ రూం ఇండ్లు, పొడు భూముల పట్టాలు, దళితులకు మూడు ఎకరాల భూమి, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్ల హామీల అమలు ఊసే లేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
RevanthReddy on Hyderabad Second Capital : కేసీఆర్ చేసిన మోసాలకు అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే ఉద్యమం జరిగేటప్పుడు కేటీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణ కవులు, కళాకారులను అవమానించే హక్కు కేటీఆర్‌కు లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ని ముఖ్యమంత్రి చేస్తానని బండి సంజయ్ ఇండైరెక్ట్‌గా చెబుతున్నారని ఆరోపించారు. మరోవైపు హైదరబాద్ రెండో రాజధాని విషయంలో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ అంశం అంత అషామాషీ కాదని.. విస్తృతంగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా డిక్లరేషన్‌పై చర్చ జరుగుతోందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. భట్టి విక్రమార్క పాదయాత్ర నెలాఖరులో ముగుస్తోందని.. ఈ సందర్భంగా ఖమ్మంలో జాతీయ నాయకులతో ముగింపు సభ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నామని వివరించారు. ఈమేరకు భట్టితో సంప్రదించి ముగింపు సభ జరిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. మరోవైపు పార్టీలో నేతల చేరికలపై ఊహాగానాలు వద్దని.. అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నాక అధికారికంగా ప్రకటిస్తామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
"కేసీఆర్ పాలనలోని పది పథకాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా డిక్లరేషన్‌పై చర్చ జరుగుతోంది. తెలంగాణ కవులు, కళాకారులను అవమానించే హక్కు కేటీఆర్‌కు లేదు. ఉద్యమం జరిగేటప్పుడు కేటీఆర్ ఎక్కడున్నారు. రెండో రాజధానిపై ప్రతిపాదన వస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. విస్తృతంగా చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకోవాలి. నేతల చేరికలపై ఊహాగానాలు వద్దు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నాక అధికారికంగా ప్రకటిస్తాం. బీసీ గర్జన సభకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను పిలవాలని నిర్ణయించాం." - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి: REVANTH REDDY: 'రైతులకు కావాల్సింది రైతు బీమా కాదు.. పంట బీమా'
Revanth Comments on BRS : 'బీఆర్‌ఎస్ విస్తరణ కోసం ప్రజాధనం వినియోగిస్తున్నారు'
Revanth Reddy on KCR త్యాగాల తెలంగాణలో కేసీఆర్ దోపిడిని భరించాల్సిన అవసరం లేదు