ETV Bharat / state

రాకేశ్ చావుతో తెరాస శవరాజకీయాలు చేస్తోంది:రేవంత్​రెడ్డి - హైదరాబాద్ తాజా వార్తలు

REVANTH REDDY: ఓ పక్క రాకేష్‌ అంతిమయాత్ర జరుగుతుండగా మరో పక్క కాంగ్రెస్‌ నేతల్ని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలను దారితీసింది. రాకేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాకేష్‌ మృతదేహానికి నివాళులు అర్పించేందుకు వెళ్లిన సీతక్కను తెరాస శ్రేణులు అడ్డుకున్నారు.

రేవంత్‌రెడ్డి
రేవంత్‌రెడ్డి
author img

By

Published : Jun 18, 2022, 8:43 PM IST

REVANTH REDDY: సికింద్రాబాద్‌ ఘటనలో మృతి చెందిన రాకేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డిని అరెస్ట్‌ చేయడం ఉద్రిక్తతలు రేపింది. వరంగల్‌కు వెళ్తున్న రేవంత్​రెడ్డిని ఘట్​కేసర్ టోల్‌గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాకేశ్ చావును వాడుకుని తెరాస శవరాజకీయాలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ అరెస్ట్‌తో ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి కొండా సురేఖతోపాటు కాంగ్రెస్ శ్రేణులు స్టేషన్​ వద్దకు చేరుకుని రేవంత్‌రెడ్డిని విడుదల చేయాలని ఆందోళనకు దిగారు.

అనంతరం ఘట్‌కేసర్ పోలీస్​స్టేషన్​ నుంచి రేవంత్‌రెడ్డిని విడుదల చేశారు. రాష్ట్రంలో గందరగోళానికి మోదీ, కేసీఆర్‌ విధానాలే కారణమని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం శవరాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు, రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే వరకు పోరాడతానని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు.

మరోపక్క వరంగల్‌ జిల్లా దబీర్‌పేటలో రాకేశ్ అంతిమయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంతిమయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే సీతక్కకు వ్యతిరేకంగా తెరాస శ్రేణులు నినాదాలు చేశారు. దీంతో సీతక్కను పోలీసులు అడ్డుక్కొని వేరే చోటకు తరలించారు. ప్రజలపక్షాన పోరాటాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్‌ ఇతర వరంగల్‌ జిల్లా నాయకులను అరెస్టు చేయడం దారుణమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌ గౌడ్‌ ధ్వజమెత్తారు. చావులకు, పరామర్శలకు వెళ్తున్న నేతలను ఎలా అరెస్టు చేస్తారంటూ ఆయన మండిపడ్డారు.

రాకేశ్ చావుతో తెరాస శవరాజకీయాలు చేస్తోంది

"జరిగిన దురదృష్టకర ఘటనను రాజకీయ ప్రయోజనాలకు తెరాస వాడుకుంటుంది. మిగతా ప్రతిపక్షాలను నియత్రించింది. అక్కడ అంతా తెరాస ర్యాలీగా ఉంది. చనిపోయిన వ్యక్తి ఎవరు. ఎందుకు చనిపోయాడు. నిసగ్గుగా శవాన్ని కూడా రాజకీయంగా వాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. అతని చావుకు మోదీ, రాష్ట్ర ప్రభుత్వం కారణం. మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు." - రేవంత్​రెడ్డి పీసీసీ అధ్యక్షుడు

ఇదీ చదవండి: 'సికింద్రాబాద్​లో జరిగిన అల్లర్లలో రాష్ట్ర ప్రభుత్వ హస్తముంది'

ఆగని 'అగ్గి'.. వాహనాలు 'బుగ్గి'.. దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా 'అగ్నిపథ్​' నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.