ETV Bharat / state

మోదీ, కేసీఆర్​​ బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులుగా తయారయ్యారు: రేవంత్​రెడ్డి

Revanth Reddy fires on KCR and Modi: సీఎం కేసీఆర్, ప్రధాని మోదీలు బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులుగా తయారయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శించారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం పదిలం చేసుకోవాలని వారు చూస్తున్నారని మండిపడ్డారు. బోయిన్​పల్లిలో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. కేసీఆర్​, మోదీ కుట్రలను తిప్పికొట్టడానికి గాంధేయవాదులంతా ఏకమై ముందుకు కదలాలని పిలుపునిచ్చారు.

Revanth Reddy
Revanth Reddy
author img

By

Published : Oct 2, 2022, 5:36 PM IST

'మోదీ, కేసీఆర్​ బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులు'

Revanth Reddy fires on KCR and Modi: ప్రపంచ దేశాల్లో శాంతి కోరుకునే వారికి.. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు నెల్సన్ మండేలా లాంటి ఎందరో నాయకులకు గాంధీ స్ఫూర్తిగా నిలిచారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. ప్రపంచానికి గాంధీ ఇజాన్ని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి బాపూజీ అన్న ఆయన.. గాంధీ ఇజం చరిత్రలోనే నిలబడిందని హర్షం వ్యక్తం చేశారు. వందల సంవత్సరాలు ఈ దేశంపై ఆధిపత్యం చలాయించిన బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఎదురోడి దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని గుర్తుచేశారు.

గాంధీ స్ఫూర్తితో దేశంలో హరిత విప్లవం: ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా, డూ ఆర్ డై నినాదంతో గాంధీ ప్రపంచానికి పరిచయం అయ్యారని ఆయన అన్నారు. బోయిన్​పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న రేవంత్‌ రెడ్డి.. గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గాంధీ స్పూర్తితో కాంగ్రెస్ పార్టీ బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు హరిత విప్లవానికి జవహర్​లాల్ నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రీ పునాది వేశారని గుర్తుచేశారు.

బడుగు బలహీన వర్గాల వారికి హక్కులు కల్పించింది కాంగ్రెస్​: ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్‌ల నేతృత్వంలో అభివృద్ధికి ఎన్నో చర్యలు కాంగ్రెస్ పార్టీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. బడుగు, బలహీన, గిరిజన, మైనార్టీలకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన కొనియాడారు.

కేసీఆర్, మోదీలు బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులు: భారతీయ జనతా పార్టీ అనే విషవృక్షం దేశాన్ని కబళించాలని చూస్తోందని, సీఎం కేసీఆర్, ప్రధాని మోదీలు బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులుగా తయారయ్యారని ఆయన ఆరోపించారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం పదిలం చేసుకోవాలని వారు చూస్తున్నారని ధ్వజమెత్తారు. వారి కుట్రలను తిప్పికొట్టడానికి గాంధేయవాదులంతా ఏకమై ముందుకు కదలాలని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

"రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ దేశాన్ని ఏకీకృతం చేస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పాదయాత్ర అనంతరం ఈ నెల 24న పాదయాత్ర తెలంగాణకు వస్తుంది. గాంధీ స్పూర్తితో అందరం భారత్ జోడో యాత్రలో కదం కలపాలి. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీలు బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులుగా తయారయ్యారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం పదిలం చేసుకోవాలని చూస్తున్నారు. కేసీఆర్​ విభజించు-పాలించు అనే సూత్రం ప్రకారం పరిపాలిస్తున్నారు. వారి కుట్రలను తిప్పికొట్టడానికి గాంధేయవాదులంతా ఏకమై ముందుకు కదలాలి."- రేవంత్​ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.