ETV Bharat / state

ప్రైవేటు ఆసుపత్రులు దోపిడి చేస్తున్నాయని బంధువుల ఆగ్రహం

హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రులు దోపిడికి పాల్పడుతున్నాయని మృతుని బంధువులు ఆందోళన నిర్వహించారు. తాజాగా మోతీనగర్‌లోని సన్‌రిడ్జ్‌ ఆసుపత్రిలో కరోనా సోకి ఓ రోగి చనిపోవడంతో... 15 లక్షలు బిల్లు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తామని యాజమాన్యం మొండికేయడం వల్ల మృతుని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Relatives are protest at moti nagar
ప్రైవేటు ఆసుపత్రులు దోపిడి చేస్తున్నాయని బంధవుల ఆగ్రహం
author img

By

Published : May 31, 2021, 7:30 PM IST

ప్రైవేటు ఆసుపత్రులు దోపిడి చేస్తున్నాయని బంధువుల ఆగ్రహం

హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రులు దోపిడికి పాల్పడుతున్నాయని మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రుల యాజమాన్యాలు బిల్లుల పేరుతో పీడిస్తున్నాయని మృతుల బంధువులు ఆరోపించారు. తాజాగా మోతీనగర్‌లోని సన్‌రిడ్జ్‌ ఆసుపత్రిలో కరోనా సోకి ఓ రోగి చనిపోవడంతో 15 లక్షలు బిల్లు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తామని యాజమాన్యం మొండికేయడం వల్ల మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు.

ఆసుపత్రి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న సనత్‌నగర్‌ పోలీసులు ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. బీహెచ్​ఈఎల్​‌కు చెందిన 42 ఏళ్ల శ్రీనివాస్‌ అనే వ్యక్తికి కరోనా సోకడంతో... గత వారం క్రితం మోతి నగర్‌లోని సన్‌రిడ్జ్‌ ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో చేరే ముందు రూ.3 లక్షలు చెల్లించి చికిత్స పొందాడు.

ఇవాళ శ్రీనివాస్ పరిస్థితి విషమించి చనిపోవడం వల్ల మొత్తం బిల్లు రూ.18 లక్షలు అయిందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపారు. మిగతా 15 లక్షలు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తామని పేర్కొన్నారు. దీంతో మృతుని బంధువులు నిరసనకు దిగారు. మృతుని భార్య భాగ్య కూడా గత వారం కరోనాతోనే మృతి చెందిందని మృతుని సోదరి వాపోయింది.

ఇదీ చూడండి: Trains cancelled: ప్రయాణికులు లేని కారణంగా 27 రైళ్లు రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.