ETV Bharat / state

రేపటి నుంచి ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు

రాష్ట్రంలో సోమవారం నుంచి పాత పద్ధతిలో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులు సబ్​ రిజిస్ట్రార్లతో టెలికాన్ఫరెన్స్​ నిర్వహించారు. రిజిస్ట్రేషన్లపై దిశనిర్దేశం చేశారు.

registrations start from monday in old method
రేపటి నుంచి ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
author img

By

Published : Dec 20, 2020, 9:43 PM IST

రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులు సబ్​ రిజిస్ట్రార్లతో టెలికాన్ఫరెన్స్​ నిర్వహించారు. రేపటి నుంచి పాత పద్ధతిలో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు మొదలు కానున్న తరుణంలో సబ్​ రిజిస్ట్రార్లకు దిశనిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. కార్డ్‌ విధానంలో రిజిస్ట్రేషన్లు చేసేందుకు... అంతా సిద్ధంగా ఉండాలని యంత్రాంగాన్ని ఉన్నతాధికారులు సమాయత్తం చేశారు.

పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయనుండటంతో... రద్దీగా ఉండే అవకాశం ఉందని, ఎక్కువ మంది వచ్చినట్లయితే వారికి సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్లు ముందస్తుగా టోకెన్లు జారీ చేయాలని సూచించారు. డాక్యుమెంట్ల పరిశీలన విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారితో ఏలాంటి గొడవలు, వాగ్వాదాలు జరగకుండా మర్యాదగా నడుచుకోవాలని, బలమైన కారణాలు ఉంటే తప్ప కొర్రీలు వేయకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఫామ్‌హౌస్‌ నుంచి పాలన చేసే సీఎం ఇక వద్దు: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.