దక్షిణ మధ్య రైల్వేలోని మూడు వర్క్ షాపులైన లాలాగూడ, తిరుపతిలోని క్యారేజీ మరమ్మతు వర్క్‌షాప్స్, కోచ్ నిర్వహణ, మర్మతు పనులు, రాయనపాడులోని వర్క్‌షాప్ వ్యాగన్ల నిర్వహణ, మరమ్మత్తు పనులు నిర్వహిస్తారు. నిత్యం ఉపయోగించే కోచ్, వ్యాగన్ పరికరాలు ఉత్తమ ప్రమాణంగా, సురక్షితంగా ఉండాలంటే వాటికి కాలానుగుణంగా ఓవర్‌హాలింగ్ తప్పనిసరి.
ప్రత్యేక దృష్టి...
ఈ 2020 సంవత్సరం కొవిడ్ మహమ్మారితో కేంద్రం కొంత కాలం లాక్‌డౌన్ విధించడం వల్ల రోలింగ్ స్టాక్ కోచ్, వ్యాగన్ల నిర్వహణలో సవాళ్లు ఎదురయ్యాయని ద.మ.రైల్వే వెల్లడించింది. అత్యవసరమైన సరుకు రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి వర్క్‌షాపు వ్యాగన్లను వేగంగా సిద్ధం చేయాల్సి రావడం, క్రమంగా ప్రయాణికుల రైలు సర్వీసులు పెరుగుతుండడం వల్ల కావాల్సిన కోచ్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ద.మ.రైల్వే తెలిపింది.
కచ్చితమైన ప్రణాళిక...
ఈ అవసరాలను తీర్చడానికి కచ్చితమైన ప్రణాళికతో కోచ్, వ్యాగన్ల పీఓహెచ్ నిర్వహణ ఏర్పాటు చేశారు. 2020 సంవత్సరానికి లాలాగూడ వర్క్‌షాపు, తిరుపతి క్యారేజీ రిపేర్ షాప్ వరుసగా 1,514 కోచ్‌లు, 1,035 కోచ్‌లు ఏర్పాటు చేశాయి. రాయనపాడు వర్క్‌షాప్ 5,371 వ్యాగన్లను ఏర్పాటు చేసింది. లాలాగూడ్ వర్క్‌షాప్, రాయనపాడు వర్క్‌షాప్ ప్రారంభమైనప్పటి నుంచి మొదటిసారి డిసెంబర్ 2020లో ఔట్ టర్న్‌లో అత్యధిక రికార్డు నమోదు చేసిందని ద.మ.రైల్వే వెల్లడించింది.
లాలాగూడ్ వర్క్‌షాప్ 166 కోచ్ ఔట్‌టర్న్, రాయనపాడు వర్క్‌షాప్ 610 వ్యాగన్ల ఔట్ టర్న్ సాధించాయి. ఇందుకు అదనంగా రాయనపాడు వర్క్‌షాప్ 09 క్టోజడ్ సర్క్యూట్ రేక్లను (సీసీ రేక్స్) తయారు చేసింది. ఇవి తరువాతి పీఓహెచ్ వరకు ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఉపయోగపడతాయి.
ఉత్తమ ఇంధన పొదుపు యూనిట్...
లాలాగూడ వర్క్‌షాపు కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ద్వారా 2020 సంవత్సరంలో ఉత్తమ ఇంధన పొదుపు యూనిట్‌గా గుర్తించబడింది. తిరుపతి వర్క్‌షాప్ ద్వారా ఐసీఎఫ్ కోచ్‌ను రెస్టారెంట్ కార్లగా మార్చే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. లాలాగూడ వర్క్‌షాప్ వీపీఆర్ కోచును ఏఎన్‌ఎమ్‌జీ కోచ్‌గా మార్చే ఘనత దక్కించుకుంది.
ఇవీ చూడండి: మొదటి కరోనా వ్యాక్సిన్ నేనే తీసుకుంటా: మంత్రి ఈటల