ETV Bharat / state

రిజిస్ట్రేషన్ల శాఖకు రికార్డు స్థాయిలో ఆదాయం

రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12,364 కోట్ల మేర రాబడి సమకూరినట్లు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తెలిపారు.

రిజిస్ట్రేషన్ల శాఖకు రికార్డు స్థాయిలో ఆదాయం
రిజిస్ట్రేషన్ల శాఖకు రికార్డు స్థాయిలో ఆదాయం
author img

By

Published : Apr 1, 2022, 12:16 AM IST

రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఒక్క మార్చి నెలలోనే రిజిస్ట్రేషన్ల ద్వారా అత్యధికంగా రూ.1,501 కోట్ల రాబడి వచ్చినట్లు ఆ శాఖ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.12,364 కోట్ల మేర రాబడి సమకూరినట్లు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తెలిపారు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.12,500 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా.. రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం నిర్ధేశించిన లక్ష్యాన్ని దాదాపు చేరుకుంది.

పన్ను ఆదాయంలోనూ..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెల వరకు ఆదాయ, వ్యయ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ - కాగ్​కు నివేదించింది. ఆదాయానికి సంబంధించి బడ్జెట్ అంచనా అయిన లక్షా 76 వేల కోట్లకు గాను 64 శాతం మేర అంటే లక్షా 11వేల కోట్లు సాధించింది. పన్ను ఆదాయం అంచనాలను మాత్రం 92 శాతం వరకు అందుకొంది. పన్నుల ద్వారా లక్షా ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని అంచనా వేయగా.. ఫిబ్రవరి నెలాఖరు వరకు 98వేల కోట్లు సమకూరాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 30 వేల కోట్ల రూపాయల అదనపు పన్నురాబడి వచ్చింది.

ఫిబ్రవరి నెలలో ఖజానాకు గరిష్టంగా 12,820 కోట్ల రూపాయల పన్ను ఆదాయం సమకూరింది. నిరుడు ఫిబ్రవరిలో వచ్చిన ఆదాయం కేవలం 7,538 కోట్లు మాత్రమే. పన్ను ఆదాయం ఇప్పటికే 92 శాతం వచ్చిన నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బడ్జెట్ అంచనాలను అధిగమించే అవకాశం ఉందని అంటున్నారు.

ఇదీ చూడండి: పన్ను ఆదాయంలో అంచనాలకు చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.