ETV Bharat / state

'స్థిరాస్తి రంగం డీలా... మెరుగైన స్థాయిలోనే హైదరాబాద్' - Real estate sector slow downs

దేశ వ్యాప్తంగా స్థిరాస్తి రంగం మందగిస్తున్నా...హైదరాబాద్​లో మాత్రం ఆశాజనకంగానే ఉంది. గృహాల అమ్మకానికి దిల్లీలో ఎక్కువ సమయం పడుతుండగా భాగ్యనగరంలో అతి తక్కువ సమయం పడుతోంది.  మెట్రో నగరాలతో పోల్చినప్పుడు హైదరాబాద్ మిగిలిన వాటి కంటే మెరుగైన స్థాయిలోనే ఉందంటున్నారు నిపుణులు.

అతి తక్కువ అమ్ముడుపోని ఇళ్లు ఉన్నది హైదరాబాద్​లోనే
author img

By

Published : Nov 14, 2019, 4:43 PM IST

దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమనం వల్ల స్థిరాస్తి రంగం డీలా పడిపోతోంది. గృహ విక్రయాలు సైతం తగ్గిపోతున్నాయి. హైదరాబాద్​లోనూ అమ్మకాలు నెమ్మదించాయని ఇటీవల కొన్ని నివేదికలు వెల్లడించాయి. దీనికి కారణం ఆర్థిక మందగమనం కాదని, కొనేందుకు ఇళ్లు అందుబాటులో లేకపోవటమేనని స్థిరాస్తి రంగ నిపుణులు తెలిపారు. మిగతా నగరాలతో పోల్చితే భాగ్యనగరంలో మార్కెట్ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉందన్నారు.
అనుమతుల్లో జాప్యం...
భవన నిర్మాణాల కోసం కావాల్సిన పర్యావరణ, అగ్నిమాపక అనుమతులు ఇటీవల ఆగిపోయాయని క్రెడాయ్ అధ్యక్షుడు రామకృష్ణా రావు తెలిపారు. ఫలితంగా 8,9 నెలల నుంచి కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కాలేదు. అదే సమయంలో నగరంలో భూములు రేట్లు భారీగా పెరిగాయి. మొత్తంగా కొనుగోలుకు అందుబాటులో ఉన్న ఇళ్ల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వం ఇటీవల అనుమతిలిచ్చే ప్రక్రియను వేగిరం చేసిందని, జనవరిలోగా నూతన ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయని క్రెడాయ్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
మెట్రో నగరాల్లో... హైదరాబాద్ భళా
2019 మూడో త్రైమాసికం వరకు విక్రయాలు జరగకుండా ఉన్న ఇళ్ల సంఖ్య హైదరాబాద్​లో తక్కువగా ఉందని ఆనరాక్ నివేదిక వెల్లడించింది. 23,890 యూనిట్లు అందుబాటులో ఉండగా... ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో అవి విక్రయం పొందేసరికి 16 నెలల సమయం పడుతుందని తెలిపింది. సాధారణంగా 18 నుంచి 24 నెలల సమయం ఉన్నట్లయితే మార్కెట్ మంచి స్థాయిలో ఉన్నట్లు అంచనా వేస్తారు.
బెంగళూరులో విక్రయం కాని గృహాల సంఖ్య 63,540 గా ఉందని, కానీ ఇవి 15 నెలల సమయంలోనే అమ్మకం అవుతాయని ఆనరాక్ అంచనా వేసింది. ముంబయిలో ఈ ఇళ్ల సంఖ్య అత్యధికంగా 2.21 లక్షలుగా ఉందని, వాటి అమ్మకానికి 34 నెలల సమయం పడుతుందని వెల్లడించింది. దిల్లీలో 1.78 లక్షలు ఇళ్లు ఉండగా, 44 నెలల సమయం.... పూణెలో 92,560 యూనిట్లు ఉండగా, 37 నెలలు సమయం పడుతుందని స్పష్టం చేసింది. ఈ నివేదక ప్రకారం... దేశ వ్యాప్తంగా ఏడు ప్రధాన మెట్రో నగరాల్లో మొత్తం అమ్మకం కానీ ఇళ్ల సంఖ్య 6.56 లక్షలుగా ఉంది.

మెట్రో నగరాల వారీగా అమ్ముడుపోని గృహాలు...

  • ముంబయి (ఎంఎంఆర్​) - 2.21 లక్షలు
  • దిల్లీ (ఎన్​సీఆర్​)- 1.78 లక్షలు
  • పుణే- 92,560
  • బెంగళూరు- 63,540
  • కోల్​కతా- 45,570
  • చెన్నై- 31,380
  • హైదరాబాద్- 23,890
    అతి తక్కువ అమ్ముడుపోని ఇళ్లు ఉన్నది హైదరాబాద్​లోనే

ఇవీ చూడండి : అక్టోబర్​లో 4.62 శాతానికి రిటైల్​ ద్రవ్యోల్బణం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.