ETV Bharat / state

ఈనెల 11 నుంచి రాష్ట్రపతి నిలయం సందర్శన నిలిపివేత - రాష్ట్రపతి నిలయం సందర్శకుల నిలిపివేత

Rashtrapati Nilayam Shut In December : రాష్ట్రపతి శీతాకాల విడిది సందర్భంగా హైదరాబాద్​ బొల్లారం రాష్ట్రపతి నిలయంలోకి కొన్ని రోజులపాటు సందర్శకులను అనుమతించబోమని అధికారులు వెల్లడించారు. ఆమె పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లు, నిర్వాహణ కోసం డిసెంబరు 11వ తేదీ నుంచి 25 వరకు సందర్శకులను అనుమతించబోమని తెలిపారు.

Rashtrapati Nilayam Visiting in Hyderabad
Rashtrapati Nilayam Shut In Decembe
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 4, 2023, 7:45 PM IST

Rashtrapati Nilayam Shut In December : రాష్ట్రపతి శీతాకాల విడిది సందర్భంగా హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోకి కొద్ది రోజులపాటు సందర్శకులను అనుమతించబోమని అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో రాష్ట్రపతి ఈ నిలయంలో కొద్ది రోజుల పాటు సందర్శన ఉంటడం ఆనవాయితీగా వస్తోంది. ఆమె పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లు, నిర్వహణ కోసం ఈ నెల 11 తేదీ నుంచి 25 వరకు సందర్శకులను అనుమతించబోమని అధికారులు తెలిపారు. శీతాకాల విడిది పూర్తయ్యే వరకు ప్రజలెవరూ రావద్దని వారు విజ్ఞప్తి చేశారు.

ఇకపై సంవత్సరం పొడవునా రాష్ట్రపతి భవనం సందర్శించొచ్చు..

రాష్ట్రపతి దక్షిణ భారత దేశ పర్యటన సమయంలో మినహాయించి ఏడాది పొడవునా రాష్ట్రపతి నిలయాన్ని సాధారణ ప్రజలు సందర్శించవచ్చు. గతంలో ప్రజలకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే పరిమిత కాలం పాటు నిలయాన్ని సందర్శించేందుకు అనుమతి ఉండేది. కాగా గత ఏడాది నుంచి ఉగాది నుంచి ప్రెసిడెన్షియనల్​ వింగ్​, భోజనశాలతో సహా భవనం లోపలికి కూడా అనుమతిస్తున్నారు. డైనింగ్​ హాల్​కు వెళ్లే భూగర్భ సొరంగం ద్వారా ప్రయాణించి తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయ చేర్యాల్ పెయింటింగ్స్​ చూడవచ్చు.

Rashtrapati Nilayam Visiting in Hyderabad : దేశంలోనే అత్యున్నతమైన నివాసంగా పేరొందిన వాటిలో రాష్ట్రపతి భవనం ఒకటి. ఇది దిల్లిలో ఉంటుంది. దేశ పరిపాలన మొత్తం ఉత్తర భారతదేశానికే పరిమితం కాకుండా ఉండాలన్న ఉద్దేశంలో దక్షిణాది భారత్​లో హైదరాబాద్​లోని బొల్లారం దగ్గర ఈ భవనాన్ని ఏర్పాటు చేశారు. ఈ నిలయాన్ని ఆంగ్లేయులు 1805 బొల్లారంలో నిర్మించారు. ఈ భవనాన్ని అప్పట్లో వైశ్రాయ్​ అతిథి గృహంగా పిలిచేవారు. దీన్ని నిజాం పరిపాలనలో వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ నిలయాన్ని కేంద్ర ప్రభుత్వం 1950లో రూ.60 లక్షలకు కొనుగోలు చేసి, రాష్ట్రపతి నిలయంగా పేరు పట్టారు.

సామాన్య సందర్శకులతో కళకళలాడుతున్న రాష్ట్రపతి నిలయం

రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించాలి అనుకునేవారు అధికారిక వెబ్​సైట్లో టికెట్​ బుక్​ చేసుకోవాలి. భారతీయులకు, విదేశీయులకు టికెట్​ ధర వేర్వేరుగా ఉంటుంది. సందర్శనకు సంబంధించిన టికెట్లను ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ ద్వారా బుక్​ చేసుకొనే సౌకర్యాన్ని అధికారులు కల్పించారు.

ఆనవాయితీ ప్రకారం ఈ నెలలో రాష్ట్రపతి తెలంగాణకు రానున్నారు. రాష్ట్రపతి నిలయానికి కుటుంబసమేతంగా రానున్నారు. కాగా తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అనంతరం ఆమె మొదటిసారిగా రాబోతున్నారు. ప్రెసిడెంట్ రాక నేపథ్యంలో ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.

ఇకపై పర్యాటక ప్రాంతంగా రాష్ట్రపతి నిలయం.. 14 నుంచే బుకింగ్స్​ ఓపెన్​

రాష్ట్రపతి విడిదికి బొల్లారం నిలయం ముస్తాబు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.