రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలను ప్రతి కార్యకర్త ఇంటింటికీ తీసుకువెళ్లాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ 75వ జయంతి ఉత్సవాలను గాంధీ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. గాంధీ, నెహ్రు కుటుంబాలు చేసిన త్యాగాలను భాజపా తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఉత్తమ్ ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా హోంమంత్రి అమిత్ షా నెహ్రూని కించ పరిచేలా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. మండల కమిషన్ తీసుకొచ్చి స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి రాజీవ్ గాంధీ కృషి చేశారని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులకు గుర్తింపు ఇవ్వాలని రాజీవ్ గాంధీ ఆనాడే చెప్పారని వీహెచ్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లకు తెరాస ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ఇతర నేతలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'కేసీఆర్‌పై సీబీఐ కేసులను ఎందుకు పక్కనపెట్టారు'