భారీ వర్షాలకు.. హైదరాబాద్ ఎక్కడికక్కడ స్థంభించిపోయింది. అపార్ట్మెంట్ సెల్లార్లు వరద నీటితో నిండిపోయాయి. రోడ్లు వాగులు, కాలువలను తలపిస్తున్నాయి. కాగా.. హైదరాబాద్లోని మైదానాలు నీటితో నిండిపోయాయి.
గోల్కొండలో ఏర్పాటు చేసిన గోల్ఫ్ స్టేడియం భారీ వర్షానికి నీట మునిగింది. వరద నీరు రావడం వల్ల.. మైదానంలో నీళ్లు నిండి.. జలాశయాన్ని తలపిస్తున్నది. మైదానం పూర్తిగా బురదమయం అయిందని గోల్ఫ్ కమిటీ సభ్యులు తెలిపారు.
ఇవీ చూడండి: జీహెచ్‌ఎంసీలో ఆస్తుల నమోదు ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేత