కర్ణాటక ఉత్తర ప్రాంతం నుంచి కేరళ దక్షిణ ప్రాంతం వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరోవైపు కర్ణాటకపై గాలులతో ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలోని 227 ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురిశాయి. అత్యధికంగా బాచుపల్లి(హైదరాబాద్)లో 3.7 సెం.మీటర్లు, ధరూర్(వికారాబాద్ జిల్లా)లో 3.6, మియాపూర్‌లో 3.2 సెం.మీటర్ల వర్షం కురిసింది. వర్షాలతో గాలిలో తేమ పెరిగి ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 7.2 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. మంగళవారం రాత్రి మెదక్‌లో 18.2 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది.
ఇదీ చూడండి: అకాల వర్షం... కొట్టుకు పోయిన ధాన్యం