కరోనా వైరస్ సోకకుండా రైల్వే శాఖ తరపున అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశంలోని అన్ని రైల్వే బోర్డు ఛైర్మన్, సభ్యులతో పాటు జనరల్ మేనేజర్లు, డీఆర్ఎంలతో దృశ్యమాధ్యమ సదస్సును నిర్వహించారు. వైరస్ నియంత్రణకు అధికారులు చేపట్టిన చర్యలను ప్రశంసించారు. తక్షణం తీసుకోవలసిన చర్యలు, వాటి పర్యవేక్షణపై సూచనలు చేశారు.
రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులకు, వివిధ జోనల్ రైల్వేల అధికారులకు మధ్య సమన్వయం కోసం ఆన్లైన్ డాష్ బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి సూచించారు. ప్రతి జోన్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ ఉండి కొవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైల్వే బోర్డుతో సంప్రదిస్తూ ఉంటారని తెలిపారు. ప్రయాణికులు బయలు దేరేముందు తమకు జ్వరం లేదని నిర్ధారించుకోవాలని ఆయన తెలిపారు. అత్యవసరమైతేనే ప్రయాణం చేయాలని కోరారు.
ఇవీ చూడండి: సీతారాములను వదలని కరోనా.. కల్యాణంపై కొవిడ్-19 ఎఫెక్ట్