raghunandanrao fire on police :ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నిరసన తెలిపే హక్కులను సైతం కాలరాస్తున్నారని... భాజపా ఎమ్మెల్యే రఘునందనరావు విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడిలో అరెస్టు అయిన భాజపా కార్యకర్తలను కలిసేందుకు బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా భాజపా కార్యకర్తలను అరెస్టు చేసినందుకు డీజీపీ మహేందర్ రెడ్డిపై రఘనందన్ రావు మండిపడ్డారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
నాన్ బెయిలబుల్ కేసులు పెడుతూ అర్థరాత్రిళ్లు అపరాత్రిళ్లు రిమాండ్ చేస్తుంటే... న్యాయ వ్యవస్థ తమను ఆదుకోటానికి రాకుంటే... ఈ రాష్ట్రంలో ఇక తమకు న్యాయం దక్కదని భావిస్తున్నామన్నారు. అరెస్టు అయిన వారిని వర్చువల్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు బంజారాహిల్స్ సీఐ నరేందర్ తెలిపారు.
ఇవీ చదవండి: