ETV Bharat / state

గడ్డికోస్తుండగా పోయిన మాజీ ఎమ్మెల్యే ఉంగరం.. మెటల్ డిటెక్టర్ సాయంతో కనిపెట్టిన పోలీసులు

Navaratna Ring Lost By Former MLA NVSS Prabhakar: ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్ పొగొట్టుకున్న నవరత్నాల ఉంగరాన్ని రాచకొండ పోలీసులు కనిపెట్టారు. వ్యవసాయ క్షేత్రంలో గడ్డి కోస్తుండగా నవరత్నాల ఉంగరం పోయిందని రాచకొండ పోలీసు కమిషనర్‌కు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. వెంటనే రాచకొండ సీపీ ఉన్నతస్థాయి సాంకేతిక బృందాన్ని వ్యవసాయ క్షేత్రానికి పంపించగా నిమిషాల మీద ఆ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వెలికి తీసి అందజేశారని, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ తెలిపారు.

Navaratna Ring Lost By Former MLA NVSS Prabhakar

author img

By

Published : Dec 7, 2022, 4:26 PM IST

Updated : Dec 7, 2022, 5:19 PM IST

మాజీ ఎమ్మెల్యే నవరత్నాల ఉంగరం.. నిమిషాల వ్యవధిలోనే వెతికిపెట్టిన పోలీసులు

Navaratna Ring Lost By Former MLA NVSS Prabhakar:వ్యవసాయ క్షేత్రంలో పోగొట్టుకున్న నవరత్నాల ఉంగరాన్ని.. పోలీసు సిబ్బంది నిమిషాల వ్యవధిలోనే వెతికిపెట్టారు. అయితే, ఆ ఉంగరం ఓ మాజీ ఎమ్మెల్యేది కావడం ఇక్కడ గమనార్హం. భాజపా నేత, ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌.. వ్యవసాయ క్షేత్రంలో గడ్డి కోస్తుండగా నవరత్నాల ఉంగరాన్ని పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని రాచకొండ సీపీకి తెలియజేయగా, వెంటనే ఉన్నతస్థాయి సాంకేతిక బృందాన్ని పంపించారు. వారంతా ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిమిషాల వ్యవధిలోనే నవరత్నాల ఉంగరం జాడ కనిపెట్టారు. దీంతో రాచకొండ పోలీసులకు ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ధన్యవాదాలు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 7, 2022, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.