ఆదివారం రాత్రి సమయంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్.. ఆయన ఇంటికి వెళ్తుండగా హైదరాబాద్ లంగర్ హౌస్ వద్ద ఓ పదేళ్ల బాలుడు ఆకలితో బాధ పడడం గుర్తించారు. తానే స్వయంగా ఆ బాబుతో మాట్లాడి భోజనం పెట్టించారు. ఆ తర్వాత వెంటనే బాలుడిని తన ఎస్కార్ట్ ద్వారా లంగర్ హౌస్ పోలీసులకు అప్పగించేలా చూశారు.
లంగర్ హౌస్ పోలీసులు బాబుని విచారించగా తాను ఇంటిలో గొడవపడి వచ్చినట్లు చెప్పాడు. బాలుడిని వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఇవీ చూడండి: శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు