ETV Bharat / state

జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా రవీంద్రనాథ్​ - జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ

జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడి ఎంపికకు బుధవారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బి.రవీంద్రనాథ్ అధ్యక్షుడిగా ఎన్నికవగా.. కార్యదర్శిగా మురళీ ముకుంద్‌, కోశాధికారిగా నాగరాజు నియమితులయ్యారు.

Jubilee Hills Co-operative Housing Society
జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా రవీంద్రనాథ్​
author img

By

Published : Mar 25, 2021, 2:41 AM IST

Updated : Mar 25, 2021, 7:03 AM IST

జూబ్లీహిల్స్‌ కో-ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ అధ్యక్షుడిగా బి.రవీంద్రనాథ్‌ నియమితులయ్యారు. సొసైటీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో రవీంద్రనాథ్‌ ప్యానెల్‌ ఘన విజయం సాధించింది. కార్యదర్శిగా మురళీ ముకుంద్‌ (జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ మేనేజింగ్‌ కమిటీ ఛైర్మన్‌), అదనపు కార్యదర్శిగా ఆదాల హిమబిందురెడ్డి, ఉపాధ్యక్షురాలిగా సునీలరెడ్డి, కోశాధికారిగా నాగరాజును ఎన్నుకున్నారు.

ఎన్నికల అధికారిగా వ్యవహరించిన మానస సొసైటీ కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాలను అందించారు. మిగిలిన 10 మంది సభ్యులుగా కొనసాగుతారు.సొసైటీ సభ్యులకు అన్ని సేవలు ఒకే చోట లభించేలా సింగిల్‌ విండో పద్ధతి ఏర్పాటు చేస్తామని రవీంద్రనాథ్‌ తెలిపారు.

ఇదీ చదవండి: కొత్త రైల్వే లైన్ నిర్మించే ఉద్దేశమేమీలేదు: పీయూశ్​ గోయల్

Last Updated : Mar 25, 2021, 7:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.