ETV Bharat / state

సాగు చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లు: ఆర్​.నారాయణమూర్తి - narayanamurthi movie raytanna on farmers

రైతులకు కావాల్సింది ఒకే ధర, ఒకే మార్కెట్ కాదని.. పండించిన పంటకు మద్దతు ధర అని ప్రముఖ నటుడు, నిర్మాత ఆర్​.నారాయణమూర్తి అన్నారు. ఏపీ విజయవాడలోని ఐలాపురంలో రైతు నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. కేంద్రం సాగుచట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నదాతలపై "రైతన్న" సినిమా తీసినట్లు వెల్లడించారు.

R. narayana murthy
ఆర్​. నారాయణమూర్తి
author img

By

Published : Jul 27, 2021, 7:28 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లు అని ప్రముఖ నటుడు, నిర్మాత ఆర్​.నారాయణమూర్తి పేర్కొన్నారు. ఏపీ విజయవాడలోని ఐలాపురంలో రైతు నాయకులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. రైతులకు కావాల్సింది ఒకే ధర, ఒకే మార్కెట్ కాదని.. పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో అలుపెరగని పోరాటాలు సాగిస్తున్న అన్నదాతలపై 'రైతన్న' సినిమా తీశానని ఆర్ నారాయణ మూర్తి అన్నారు. ఏళ్లుగా రైతులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాలకి కనువిప్పుగా ఈ సినిమా చిత్రీకరించినట్లు వెల్లడించారు. ప్రతి రైతు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ చిత్రంలో పొందుపరిచినట్లు తెలిపారు.

రైతులే ప్రధానాంశంగా రెండున్నర గంటల సినిమాను నారాయణ మూర్తి తీయడం గొప్ప విషయమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరావు అన్నారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా ఈ సినిమా ఇతివృత్తం ఉంటుందన్న ఆయన.. ఈ రైతన్న సినిమాను ఆగస్టు 15న విడుదల చేస్తుండటం సంతోషకరమన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతు ఉద్యమానికి ఈ సినిమా ఊతమిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.
ఇదీ చదవండి: Komati reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై కేసు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.