రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యం.. అందులో ఆదివారం కావడంతో మందుబాబులు దుకాణాలకు పరుగులు తీశారు. హైదరాబాద్లోని ఉప్పల్, రామంతపూర్, ఘట్ కేసర్, బోడుప్పల్లో మద్యం దుకాణాల ముందు ఉదయం 6 గంటల నుంచే మందుప్రియులు బారులు తీరారు. చాలా చోట్ల భౌతిక దూరం పాటించకుండానే క్యూలైన్లలో నిల్చున్నారు. అలాగే మాంసం దుకాణాలు, కూరగాయలు, నిత్యావసర సరుకుల కొనుగోళ్ల కోసం దుకాణాల ముందు వరుస క్రమంలో గంటల తరబడి నిలిచి ఉన్నారు.
ఉదయం 10 గంటల తరువాత దుకాణాలు మూసివేయాలని నిబంధనలు ఉండగా.. పోలీసులు అనవసరంగా బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు, వాహనాల సీజ్ చేస్తుండటంతో ఉదయం 9 గంటల వరకే సరుకులు కొనుగోలు చేసి ఇంటికి వెళ్లాలన్న ఉద్దేశంతో మార్కెట్లకు వస్తున్నారు. ఫలితంగా ఎక్కడ చూసిన రద్దీ పెరిగిపోయింది.
ఇదీ చదవండి: మూడు ఆస్పత్రులు తిరిగినా అందని వైద్యం.. కవలలు మృతి