ETV Bharat / state

కొండచిలువ... అయితే నాకేం భయం.. - కొండచిలువ... అయితే నాకేం భయం..

అది 8 అడుగుల కొండచిలువ. దాన్ని దూరం నుంచి చూస్తేనే గుండెలదిరిపోతాయి. ఇక దగ్గరికొస్తుంటే ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీస్తాం. అలాంటిది ఆ భారీ సర్పాన్ని ఓ మహిళ చేత్తో పట్టుకుని బయటకు లాగింది. చెరకుతోటలో ముడుచుకుని పడుకున్న కొండచిలువను ధైర్యంగా పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించింది.

కొండచిలువ... అయితే నాకేం భయం..
author img

By

Published : Nov 20, 2019, 5:45 PM IST

చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం దీనబంధుపురం గ్రామానికి చెందిన రైతు చంద్రానికి చెందిన చెరకుతోటలో కొండచిలువ కనిపించింది. ఆ భారీ సర్పాన్ని చూసిన కూలీలు భయాందోళనకు గురై అరుస్తూ పరుగులు తీశారు. పొలంలో కొండచిలువ ఉందన్న సమాచారం తెలుసుకున్న గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయిని జాయి తోటలోకి ప్రవేశించి ఆ భారీ సర్పాన్ని బయటకు లాగారు.

ఒక యువకుడి సహాయంతో 8 అడుగుల పొడవున్న చిలువను తోట బయటకు తీసుకొచ్చారు. అనంతరం దాన్ని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. కొండచిలువ విష సర్పం కాదని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయి గ్రామస్థులకు ధైర్యం చెప్పారు.

కొండచిలువ... అయితే నాకేం భయం..

ఇవీ చదవండి.. గ్రామానికి వచ్చిన హీరోయిన్లు... ఎక్కడో తెలుసా..!

Intro:చెరుకు తోటలో చుట్ట చుట్టుకొని కూలీలను భయబ్రాంతులకు గురి చేసిన భారీ కొండచిలువను ఓ మహిళ సాహసంతో వెలుపలికి తీసి అటవీ శాఖ అధికారులకు అప్పగించింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాల సముద్రం మండలం దీనబంధు పురం గ్రామానికి చెందిన రైతు చంద్రం వ్యవసాయ పొలంలో ఉన్న చెరుకు తోటలో భారీ కొండచిలువను గుర్తించిన కూలీలు అరుస్తూ భయాందోళనకు గురై పరుగులు తీశారు.

Body:పరుగులు తీస్తున్న కూలీల నుండి సమాచారం తెలుసుకొని గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు జాయి తోటలోకి ధైర్యంగా ప్రవేశించి కొండచిలువను గుర్తించారు. గ్రామానికి చెందిన యువకుడు రాబర్ట్ సాయంతో చెరుకు తోట నుండి ఎనిమిది అడుగుల పొడవున్న భారీ e కొండచిలువను వెలుపలకు లాగారు. వెలుపలకు వచ్చిన కొండచిలువను ఆసక్తిగా గమనించిన పలువురు గ్రామస్తులు కదులుతున్న కొండచిలువను చూసి భయాందోళనకు గురై పరుగులు తీశారు.

Conclusion:పారిపోతున్న ప్రజలను చూసి విశ్రాంత ఉపాధ్యాయురాలు జాయి మాట్లాడుతూ కొండచిలువ విష సర్పం కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి కొండచిలువను మహిళ వారికి అందజేశారు. గమనిక: ఈ సమాచారాన్ని ap_tpt_41_19_kondachiluva_pattivetha_av_ap10106 ఫైల్ కు అనుబంధంగా వాడుకోగలరు. మహేంద్ర ఈటివి భారత్ జీడి నెల్లూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.