పీవీ సురభివాణికి మద్దతుగా ఈనెల 7న దోమలగూడలో పీవీ వాణి సమన్వయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమ పోస్టర్‌ను సోమాజిగూడలో తెలంగాణ బ్రహ్మణ సంఘాల సమాఖ్య విడుదల చేశాయి.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాణిదేవికి మద్దతుగా ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలంగాణ బ్రహ్మణ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు తులసి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పాల్గొంటారని తెలిపారు. సీఎం కేసీఆర్ బ్రహ్మణులను గుర్తించి బ్రహ్మణ పరిషత్ ఏర్పాటు చేయడంతో పాటు.. విదేశీ ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నారని గుర్తు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని బ్రహ్మణులంత సురభి వాణిదేవి విజయనికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు
ఇదీ చూడండి: 'ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల మధ్య తెరాస చిచ్చు పెడుతోంది'