ETV Bharat / state

ఆస్తుల వివరాల సేకరణ కోసం అధికారులకు ప్రత్యేక యాప్

తెలంగాణలో ఆస్తులను ధరణి పోర్టల్​తో అనుసంధానించే ప్రక్రియ వేగవంతమైంది. ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక నమూనా రూపొందించింది. ఇందులో 48 అంశాలున్నాయి. బుధవారం నుంచి ఈ ప్రత్యేక యాప్‌ అధికారులకు అందుబాటులోకి రానుంది. రిజిస్ట్రేషన్‌ సమయంలోనే మ్యుటేషన్‌ పూర్తి చేసి అన్ని డాక్యుమెంట్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

property details inclusion  dharani portal
ఆస్తుల వివరాల సేకరణ కోసం అధికారులకు ప్రత్యేక యాప్
author img

By

Published : Sep 30, 2020, 6:43 AM IST

రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఆస్తులను ధరణి పోర్టల్‌తో అనుసంధానించే ప్రక్రియ వేగవంతమైంది. అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రత్యేక నమోదు కార్యక్రమం మంగళవారం ప్రారంభమవగా హైదరాబాద్‌ మహానగరంలో చేపట్టాల్సి ఉంది. గ్రామ పంచాయతీల్లో ఆస్తిపన్ను సంఖ్య ఉన్నవాటిని యజమాని ఆధార్‌, ఫోన్‌ నంబరుతో అనుసంధానిస్తున్నారు. ఆస్తిపన్ను సంఖ్యలేని ఆస్తులను పక్కాగా గుర్తించి నమోదు చేస్తున్నారు. ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక నమూనా రూపొందించింది. ఇందులో 48 అంశాలున్నాయి. బుధవారం నుంచి ఈ ప్రత్యేక యాప్‌ అధికారులకు అందుబాటులోకి రానుంది. ఈ 48 అంశాలను వారు నేరుగా యాప్‌లో నమోదు చేయనున్నారు.

రిజిస్ట్రేషన్‌ సమయంలోనే మ్యుటేషన్‌ కూడా పూర్తి చేసి అన్ని డాక్యుమెంట్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అన్నింటికి ప్రాతిపదికగా ఉండే ధరణి పోర్టల్‌లో పురపాలక ఆస్తుల వివరాలు పక్కాగా ఉండేలా చర్యలు చేపట్టారు. అత్యధిక పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో పురపాలక, పట్టణ ప్రణాళిక విభాగ సిబ్బంది ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. ఖమ్మం సహా కొన్ని జిల్లాలలో వివరాల సేకరణ, నమోదుకు గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సహాయకులను వినియోగించుకుంటున్నారు.

ఆస్తిపన్ను సంఖ్య ఉన్నవే ధరణి పోర్టల్‌లోకి..

ఆస్తుల వివరాల సేకరణ, నమోదును అక్టోబరు పదిలోపు పూర్తి చేయనున్నారు. దసరా నుంచి రిజిస్ట్రేషన్లను ప్రారంభించనున్న నేపథ్యంలో అప్పటికి ఇంకా 15 రోజుల సమయం ఉంటుంది. అంతలోపు ఇబ్బందులు ఉన్నా సర్దుబాటు చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆస్తిపన్ను సంఖ్య ఉన్నవాటి వివరాలు మాత్రమే ధరణి పోర్టల్‌తో అనుసంధానం కానున్నాయి. ఆస్తిపన్ను సంఖ్య లేని ఆస్తులపై ఎలా వ్యవహరించాలి అనేది తర్వాత నిర్ణయిస్తారు.

సేకరించే ప్రధాన వివరాలు

నమోదులో భాగంగా అధికారులు... ఆస్తిపన్ను అసెస్‌మెంట్‌ నంబరు, యజమాని పేరు, చిరునామా, కులం, ఆధార్‌ సంఖ్య, పిన్‌కోడ్‌, ఫోన్‌ నెంబరు, పురపాలక వార్డు వివరాలు, ఆహార భద్రత కార్డు నంబరు, ఆస్తి స్వభావం, నిర్ణయించిన ఆస్తిపన్ను, నిషేధిత ఆస్తి అవునా? కాదా?, ఉమ్మడి ఆస్తి అయితే ఇద్దరు ముగ్గురు కుటుంబసభ్యుల వివరాల వంటివి సేకరిస్తున్నారు.

పంచాయతీల్లో కార్యదర్శిదే బాధ్యత

గ్రామ పంచాయతీల్లో గుడి, బడి, సహా అన్ని నిర్మాణాలను కొలతలు సహా నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తప్పులు జరిగితే పంచాయతీ కార్యదర్శిదే బాధ్యత అని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం అర్ధరాత్రిలోపు ఈ-పంచాయత్‌ పోర్టల్‌లో వివరాలను అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించడంతో పంచాయతీ కార్యదర్శులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కాగా వివరాల సేకరణ, నమోదుకు తగిన సమయం లేదని పంచాయతీ కార్యదర్శులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

గ్రేటర్‌లో పీటీఐఎన్‌ ఆధారంగా క్షేత్ర స్థాయిలో పరిశీలన

హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో కూడా ఆస్తుల నమోదు ప్రక్రియను జీహెచ్‌ఎంసీ చేపట్టనుంది. పురపాలకశాఖ రూపొందిస్తున్న ప్రత్యేక మొబైల్‌ యాప్‌ ద్వారా వివరాలను నమోదు చేయనున్నారు. ఆస్తిపన్ను ప్రత్యేక గుర్తింపు సంఖ్య (పీటీఐఎన్‌) ఆధారంగా క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. బిల్‌కలెక్టర్లు, రెవెన్యూ విభాగానికి సంబంధించిన ఉద్యోగులకు ఈ బాధ్యత అప్పగించనున్నారు. సిబ్బంది ఇంటింటికీ వెళ్తారు. ఇంటి ఫొటోను తీసుకుని యాప్‌లో నమోదు చేస్తారు. పక్కాగా ఉన్నవాటిని ధరిణి పోర్టల్‌కు అనుసంధానిస్తారు. ఒకటి రెండు రోజుల్లో వివరాల సేకరణ ప్రారంభించనున్నట్లు పురపాలక అధికారులు తెలిపారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది.

ఇదీ చదవండిః ఆస్తుల రక్షణకే ధరణి పోర్టల్, ఎల్​ఆర్​ఎస్​: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.