సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ పూర్తైంది. 120 మంది ఉద్యోగులకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయపరమైన చిక్కులున్న వారు, ఇటీవల మెమోలు అందుకున్న వారికి మినహా మిగతా వారికి పదోన్నతులు కల్పించారు. 57 మంది సహాయక విభాగాధికారులకు విభాగాధికారులుగా, 30 మంది విభాగాధికారులకు సహాయక కార్యదర్శులుగా పదోన్నతి లభించింది.
20 మంది సహాయక కార్యదర్శులకు ఉపకార్యదర్శులుగా, 8 మంది ఉప కార్యదర్శుల నుంచి సంయుక్త కార్యదర్శులుగా పదోన్నతి పొందారు. ఐదు మంది సంయుక్త కార్యదర్శులు నుంచి అదనపు కార్యదర్శులుగా పదోన్నతి పొందారు.
ఇదీ చదవండి: TRS BHAVAN IN DELHI: దిల్లీలో తెరాస పార్టీ కార్యాలయం శంకుస్థాపనకు సర్వం సిద్ధం