హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) తరఫున తెలంగాణ వ్యాప్తంగా వచ్చే రెండేళ్లలో మొత్తం 5 లక్షల మంది విద్యార్థులకు ప్రోగ్రామింగ్ నేర్పిస్తామని అసోసియేషన్ అధ్యక్షులు భరణి కుమార్ అరోల్ తెలిపారు. ఇప్పటికే 50వేల విద్యార్థులకు లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా పనితో పాటు కుటుంబాన్ని నిర్వహించుకుంటూ సమాజం కోసం వాలంటీర్లుగా సేవ చేసే అవకాశాలపై మార్పు కోసం ఒక వాలంటీర్ అనే ఇతివృత్తంతో హైసియా సీఎస్ఆర్ సమ్మిట్‌ను నిర్వహించింది.
విద్యా, పర్యావరణ, ఆరోగ్యం విషయంలో ఉద్యోగులు స్వచ్ఛంద సేవకులు ఉండే అవకాశాలపై ఈ సమావేశంలో వివిధ కంపెనీల ప్రతినిధులు చర్చించారు. కొవిడ్ సమయంలో హైసియా తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహించామని భరణి కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సుమారు రూ.100 కోట్లు విరాళం ఇచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి హరితహారంలో పాల్గొన్నామన్నారు.
ఇదీ చదవండి : ప్రమాదం ఆ ఇంట నింపింది పెను విషాదం