ETV Bharat / state

'ఆధిపత్య శక్తుల నుంచి విముక్తి పొందితేనే.. దేశంలో ప్రజాస్వామ్యం' - professors zoom meeting on democratic

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్రమైన విఘాతం ఏర్పడిందని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అస్తిత్వ ఉద్యమాల వెలుగులో చివరి పౌరునికి సైతం దేశ వనరుల్లో వాటా దక్కాలని ఆకాంక్షించారు. ప్రొఫెసర్​ జయశంకర్​ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్​లో తెజస అధ్యక్షుడు కోదండరాం, ప్రొఫెసర్​ యోగేంద్ర యాదవ్​, రమా మెల్కొటె తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

professors zoom meeting on democratic
ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రొఫెసర్ల జూమ్​ మీటింగ్​
author img

By

Published : Jun 19, 2021, 8:19 PM IST

దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవం చేయాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. జాతీయ వాదాన్ని ఆధిపత్య శక్తుల నుంచి విముక్తి చేసి ప్రజలపరం చేయాలని కోరారు. హైదరాబాద్​లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో 'భారత ప్రజాస్వామ్యం-ఒక అవగాహన' పేరుతో వెబినార్‌ నిర్వహించారు. ఈ వెబినార్​లో ప్రొఫెసర్‌ కోదండరాం, స్వరాజ్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ యోగేంద్ర యాదవ్, ప్రొఫెసర్ రమా మెల్కొటే, ప్రొఫెసర్‌ జయశంకర్‌, హెచ్​ఆర్​డీ కేంద్ర ఛైర్మన్‌ శ్రీశైల్‌రెడ్డి, ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు, రామారావుతోపాటు విద్యావంతుల వేదిక, ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

అస్తిత్వ ఉద్యమాల వెలుగులో చివరి పౌరునికి సైతం దేశ వనరుల్లో వాటా దక్కాలని వారు ఆకాంక్షించారు. ప్రస్తుతం రాష్ట్రం, దేశంలో ఒక అసాధారణమైన పరిస్థితిలో ఉన్నామని... గత ఏడేళ్లుగా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్రమైన విఘాతం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యంపై యోగేంద్ర యాదవ్‌ రచించిన 'మేకింగ్​ సెన్స్​ ఆఫ్ ఇండియన్​ డెమొక్రసీ' పుసక్తంలో విశదీకరించారని కోదండరాం పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Animal Warriors: మూగజీవాల పాలిట ఆపద్బాంధవులు వీరే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.